Take a fresh look at your lifestyle.

కేడీసీసీ బ్యాంక్ డిఈ శ్రీనివాస్ ను సన్మానించిన సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్

మంథని, ముద్ర విలేకరి : మంథని ది కరీంనగర్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ బ్రాంచ్ కు నూతనంగా బదిలీ పై వచ్చిన డెవలప్ మెంట్ ఎగ్జిక్యూటివ్(డిఈ) సందెబోయిన శ్రీనివాస్ ను సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ శాలువాతో సత్కరించారు. మొట్ట మొదటిసారిగా గురువారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లిమిటెడ్ మంథని కి విచ్చేసిన డిఈ శ్రీనివాస్ కు కొత్త శ్రీనివాస్ శుభాకాంక్షలు తెలిపినారు. సహకార బ్యాంకు ద్వారా సంఘ సభ్యులకు, రైతులకు త్వరితగతిన రుణాలు అందించాలని ఈ సందర్బంగా కోరారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ ఉదయశ్రీ, సంఘ కార్యదర్శి మామిడాల అశోక్ కుమార్, సంఘ సిబ్బంది పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.