Take a fresh look at your lifestyle.

నేత్ర పర్వంగా శ్రీరామ నవమి వేడుకలు

  • పాల్గొన్న ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్, జువ్వాడి కృష్ణారావు దంపతులు.

కోరుట్ల, ముద్ర: శ్రీరామ నవమి సందర్భంగా కోరుట్ల పట్టణంలోని రామ నది తీరాన గల శ్రీ రామాలయంలో, పాత బజార్ లోని శ్రీ వెంకటేశ్వర దేవాలయంలో శ్రీ సీతారాముల కల్యాణంను భక్తి శ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ సీతారామచంద్ర స్వామిని కాంగ్రెస్ పార్టీ సీనియర్ రాష్ట్ర నాయకులు జువ్వాడి కృష్ణారావు విజేత  దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ సీతారామచంద్రస్వామిల కళ్యాణ మహోత్సవానికి పట్టు వస్త్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుమల గంగాధర్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొంతం రాజం, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పెరుమాండ్ల సత్యనారాయణ, నాయకులు ఆడెపు మధు, ఎంబేరి  నాగభూషణం, ఎతిరాజం నర్సయ్య, నేతి శ్రీనివాస్, చిలువేరి విజయ్, జక్కుల ప్రసాద్, కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాల నాయకులు, కార్యకర్తలు, దేవాలయ అధికారి ముదాం విక్రమ్, జూనియర్ అసిస్టెంట్ పెడవెల్లి నర్సయ్య, కమిటీ సభ్యులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.