Take a fresh look at your lifestyle.

మంచినీటిని అందించ‌డంలో ప్ర‌భుత్వం వైఫ‌ల్యం: ఆర్. నాగరాజ్

ముద్ర, గండిపేట్ : మంచినీటిని అందించ‌డంలో కాంగ్రెస్ పాల‌కులు పూర్తిగా వైఫ‌ల్యం చెందార‌ని బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్‌ పార్టీ అధ్యక్షులు రావులకోళ్ల నాగరాజ్ అన్నారు. బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సాయి బాలాజీ నగర్, ఇండస్ వ్యాలీ, కేకే నగర్, హిమాయత్ సాగర్ లో శుద్ధి చేసిన నీరు అని కాంగ్రెస్ నాయ‌కులు ప్రచారం చేసుకోవ‌డం ప‌ట్ల ఆయ‌న అభ్యంత‌రం తెలిపారు.ఇటివ‌ల సాయి బాలాజీ నగర్ లో అప‌రిశుభ్రంగా, క‌లుషిత‌ నీళ్లు వస్తున్నాయని గుర్తించ‌డంతో మేనేజర్ ను పిలిపించి స‌మ‌స్య‌ను వివ‌రించారు.ఈ సంద‌ర్భంగా రావులకోళ్ల నాగరాజ్ మాట్లాడుతూ..అప‌రిశుభ్రంగా ఉన్న నీటి స‌మ‌స్య‌కు ప‌రిష్కారం చూపుతామ‌న్నారు.గతంలో తాను సాయి బాలాజీ నగర్ పర్యటన వెళితే ఈ రంగు నీటి స‌మ‌స్యను గుర్తించి నాడే ప్ర‌శ్నించాన‌ని, కానీ కాంగ్రెస్ నాయ‌కులు బుర‌ద జ‌ల్లుతున్నార‌ని త‌మ‌పై ఎదురు దాడి చేసిన‌ట్లు మండిప‌డ్డారు.ఇప్ప‌టికైనా పాల‌కులు క‌ళ్లు తెరిచి స‌మ‌స్య‌కు ప‌రిష్కారం చూపాల‌ని కోరారు. లేదంటే బీజేఎంసీలో ధ‌ర్నా చేయ‌డంతో పాటు క‌లెక్ట‌ర్ దృష్టికి తీసుకెళ్లి ప‌రిష్కరించేందుకు కృషి చేస్తామ‌న్నారు.

Leave A Reply

Your email address will not be published.