జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమలు ముందస్తు అనుమతి లేని ర్యాలీలు, సభలకు నిషేధం -జిల్లా ఎస్పి సునిత రెడ్డి
జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమలు
ముందస్తు అనుమతి లేని ర్యాలీలు, సభలకు నిషేధం జిల్లా ఎస్పి సునిత రెడ్డి
ముద్ర, వనపర్తి:
జిల్లాలో శాంతి భద్రతలను మరింత బలోపేతం చేయడం, ప్రజా వాతావరణం ప్రశాంతంగా కొనసాగడం, అనవసర గుంపులు నివారించడం లక్ష్యంగా పిబ్రవరి 01 నుంచి పిబ్రవరి 28 వరకు 30 పోలీస్ యాక్ట్–1861 నిబంధనలు అమల్లో ఉంటాయని జిల్లా ఎస్పీ శ్రీమతి సునిత రెడ్డి తెలిపారు. వనపర్తి జిల్లా పరిధిలో ఎవరైనా పోలీసు ఉన్నతాధికారుల ముందస్తు అనుమతి లేకుండా ధర్నాలు, ర్యాలీలు, బహిరంగ సభలు, భారీ స్థాయి సమావేశాలు నిర్వహించడం నిషేధం నిషేధించడం జరిగిందని. ప్రజా జీవనానికి అంతరాయం కలిగించే, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఏ చర్యకైనా చోటు లేదు అని స్పష్టం చేశారు. అలాగే “30 పోలీస్ యాక్ట్” ఉల్లంఘనలకు చట్టంలో స్పష్టమైన శిక్షలు ఉన్నాయి. అనుమతి లేకుండా కార్యక్రమాలు చేపట్టిన వారిపై ఎటువంటి మినహాయింపు లేకుండా చర్యలు తీసుకుంటాం అన్నారు. నిబంధనలు ప్రజల భద్రత కోసం పెట్టబడ్డాయని, అందరూ తప్పనిసరిగా పాటించాలని హెచ్చరించారు. ఏ కార్యక్రమం కావాలన్నా ముందుగానే దరఖాస్తు చేసి అనుమతి పొందాలని. ప్రజల సహకారం వల్లనే శాంతిభద్రతలు నిలుస్తాయి. పోలీసుల చర్యలు ప్రజల రక్షణ కోసమేనని ఎస్పీ తెలిపారు.