Take a fresh look at your lifestyle.

ఇంటర్ విద్యార్థులు ఒత్తిడికి లోను కావద్దు పరీక్షా కేంద్రం తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

 

మహదేవపూర్, ముద్ర:

విద్యార్థులు ఎటువంటి ఒత్తిడికి లోనుకాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. అలాగే పరీక్షా కేంద్రాల వద్ద తాగునీరు, వైద్య సదుపాయం, భద్రత వంటి అవసరమైన సౌకర్యాలు తప్పనిసరిగా ఉండాలని ఆదేశించారు. పరీక్షా కేంద్రాల్లో నిబంధనలు కచ్చితంగా పాటించడంతో పాటు ఎలాంటి మాల్ప్రాక్టీసులకు తావు లేకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులను నిశితంగా పరిశీలించిన తదుపరి మాత్రమే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించాలని సూచించారు.పరీక్షల నిర్వహణ విధానం, భద్రతా ఏర్పాట్లు, విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలను ఆయన పరిశీలించారు. పరీక్షా కేంద్రంలో ఏర్పాటు చేసిన సీటింగ్ వ్యవస్థ, సీసీ కెమెరాలు, ఇన్విజిలేటర్ల విధులు, విద్యార్థుల హాజరు వివరాలను కలెక్టర్ పరిశీలించారు. అనంతరం తనిఖీ రిజిస్టర్ లో సంతకం చేశారు. మొదటి సంవత్సరం పరీక్ష జరుగుతుందని 228 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 10 మంది గైర్హాజరు అయినట్లు తెలిపారు. ఆయన వెంట ఆర్డిఓ హరికృష్ణ, పరీక్షల విభాగం చీఫ్ సూపరింటెండెంట్ సదానందం, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.