ముద్ర ప్రతినిధి, నిర్మల్:
ఎన్నికలు మూడు రోజులున్న సమయంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు యువకులు బీజేపీలో చేరారు. పట్టణంలోని 36వ వార్డు బుధవార్ పేట్ కు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు మౌర్య ప్రవీణ్, పడిగల మురళి, పడిగల ముకేష్, దర్శనం పరమేశ్, తో పాటు పలువురు యువకులు బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సమక్షంలో భారతీయ జనతా పార్టీ లో చేరారు. ఈ సందర్భంగా మహేశ్వర్ రెడ్డి కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మెడిసెమ్మ రాజు, చరణ్ మౌర్య, రవి, కత్తి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.