Take a fresh look at your lifestyle.

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కు కలెక్టర్ ఘన నివాళి

ముద్ర, ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో: సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కు ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఘనంగా నివాళులర్పించారు. బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, అదనపు కలెక్టర్లు డా. పి. శ్రీజ, పి. శ్రీనివాస రెడ్డి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ పాపన్న గౌడ్ ఆశయ సాధనకు అందరూ పాటు పడాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జిల్లా బీసి అభివృద్ధి అధికారిణి జి. జ్యోతి, గౌడ సంఘం నాయకులు మిత్రు గౌడ్, అంజయ్య, కలెక్టరెట్ పరిపాలన అధికారి ఎన్. అరుణ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.