- కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను కలిసిన బీఆర్ఎస్ నేతలు
ముద్ర, తెలంగాణ బ్యూరో : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల విధ్వంసంను ఆపేలా చర్యలను తీసుకోవాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌కు విద్యార్ధులతో కలిసి బీఆర్ఎస్ పార్టీ నేతలు విజ్ఞప్తి చేశారు.ఈ మేరకు బుధవారం ఢిల్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ నేతృత్వంలోని పలువురు బీఆర్ఎస్ నేతలు, విద్యార్ధులు కలిసి కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు వినతిపత్రాన్ని సమర్పించారు.అనంతరం దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ..హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను రియల్ ఎస్టేట్ మాఫియాకు అప్పగించడానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను బిఆర్ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని అన్నారు. విద్యార్థుల హక్కులను రక్షించేందుకు, పర్యావరణాన్ని కాపాడేందుకు, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టేందుకు బిఆర్ఎస్ పార్టీ కట్టుబడి ఉందన్నారు.ఈ అక్రమ వ్యవహారాలను అరికట్టకపోతే, రేవంత్ రెడ్డి ప్రభుత్వ దురాక్రమణలపై రాష్ట్రవ్యాప్త ఉద్యమాన్ని ప్రారంభించడానికి బిఆర్ఎస్ సిద్ధంగా ఉందని దాసోజు శ్రావణ్ హెచ్చరించారు.