రామకృష్ణాపూర్, ముద్ర విలేకరి : పట్టణ మున్నూరు కాపు సంఘం నూతన కమిటీని ఆదివారం ఎన్నుకున్నట్లుగా గౌరవ అధ్యక్షుడు రామిడి కుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. స్థానిక గద్దె రాగడి ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో పూర్తి కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షునిగా గాండ్ల సమ్మయ్య, ప్రధాన కార్యదర్శిగా అలుగల సత్తయ్య,ముఖ్య సలహాదారులుగా పల్లె రాజు, ఉపాధ్యక్షులుగా ఆత్మకూరి మహేందర్, మొట్ట సుధాకర్, పానుగంటి సత్తయ్య, ఆశనవేణి సత్యనారాయణ, కోశాధికారి మేకల సురేందర్, కార్యదర్శులుగా ఉప్పరి చంద్రమౌళి, పెరుక క్రాంతి, వీరమల్ల రాజయ్య, రెంటం రవి, సహాయ కార్యదర్శులుగా ఇందూరు నారాయణ,సామంతుల రాజన్న, రామిడి రాజన్న,రాంశెట్టి లక్ష్మణ్, ప్రచార కార్యదర్శిగా నరెడ్ల వెంకన్న, ఎగ్జిక్యూటివ్ మెంబర్ పడాల నరసయ్య లు ఎన్నికయ్యారు. అనంతరం నూతన అధ్యక్షుడు గాండ్ల సమ్మయ్యను శాలువాతో సన్మానించారు.