ముంబాయి/హన్మకొండ:
నిర్మాణ రంగంలో తనదైన ముద్ర వేసిన ప్రముఖ పారిశ్రామికవేత్త, శ్రీ సత్య సాయి ఇన్ప్రాస్టక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ వేముల సత్యమూర్తి ప్రతిష్టాత్మకమైన బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (BAI) జాతీయ ఉపాధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించారు.

ముంబాయిలోని బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(బాయ్) ప్రధాన కార్యాలయంలో మంగళవారం అట్టహాసంగా జరిగిన నూతన కార్యవర్గం బాధ్యతల స్వీకారం కార్యక్రమంలో జాతీయ ఉపాధ్యక్షులు వేముల సత్యమూర్తి అధికారికంగా బాధ్యతలు చేపట్టారు.2025-2026 బాయ్ జాతీయ అధ్యక్షులు రాజేంద్ర సింగ్ కాంబోజ్ నేతృత్వంలో నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేసింది. వరంగల్ కు చెందిన వేముల సత్యమూర్తిది స్ఫూర్తిదాయకమైన ప్రస్థానం 1979లో ఒక సామాన్య కాంట్రాక్టరుగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన వేముల సత్యమూర్తి, నేడు దేశంలోని ప్రముఖ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థల్లో ఒకటిగా శ్రీ సత్య సాయి ఇన్ప్రాస్టక్చర్స్ ప్రైవేటు లిమిటెడ్ ను తీర్చిదిద్దారు.నిర్మాణ రంగంలో నాలుగు దశాబ్దాలకు పైగా అపారమైన అనుభవం కలిగిన ఆయన ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టులు, కాలువలు, రహదారుల నిర్మాణంలో ఆయన సంస్థ ఎన్నో రికార్డులను సృష్టించింది.గతంలో ఆయన BAI వరంగల్ సెంటర్ చైర్మన్ గా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో బాయ్ రాష్ట్ర చైర్మన్ గా పనిచేసి అసోసియేషన్ బలోపేతానికి ఎంతో కృషి చేశారు.కేవలం వ్యాపారవేత్తగానే కాకుండా, సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా ఆయన చురుగ్గా పాల్గొంటారు.

బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (BAI) అనేది దేశవ్యాప్తంగా ఉన్న సివిల్ ఇంజనీరింగ్ నిర్మాణ సంస్థల యొక్క అత్యున్నత ప్రతినిధి సంస్థ.1941లో స్థాపించబడిన ఈ సంస్థ, దేశ నిర్మాణ రంగంలో ఎదురయ్యే సవాళ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తుంది.భారత్ అంతటా 264 సెంటర్లను, 24 వేల మంది సభ్యులను కలిగి ఉన్న ఏకైక అతిపెద్ద అసోసియేషన్ ఇది.బిల్డర్ల హక్కులను కాపాడటం, నిర్మాణ రంగంలో ఆధునిక సాంకేతికతను ప్రోత్సహించడం.. ప్రభుత్వ విధానాల రూపకల్పనలో భాగస్వామ్యం వహించడం దీని ప్రధాన ఉద్దేశ్యం.నూతన బాధ్యతలపై స్పందనగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం వేముల సత్యమూర్తి మాట్లాడుతూ తనపై ఎంతో నమ్మకంతో ఈ కీలక బాధ్యతను అప్పగించినందుకు మొదట కృతజ్ఞతలు తెలిపారు. దేశ నిర్మాణ రంగంలో బిల్డర్లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి, ముఖ్యంగా ముడిసరుకుల ధరల నియంత్రణ, కార్మికుల సంక్షేమం కోసం తన వంతు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో 2026-2027 సంవత్సరానికి గాను ఎన్నికైన నూతన బాయ్ జాతీయ అధ్యక్షులు కాన్ పూర్ కు చెందిన ధర్మేష్ అశ్వస్థి,గౌరవ ప్రధాన కార్యదర్శి మొహిందర్ హెచ్. రిజ్వానీ, గౌరవ కోశాధికారి అనిరుద్ధ వి.నఖ్వా,
బాయ్ పూర్వ అధ్యక్షులు నోయిడా కు చెందిన లాల్ చంద్ పాషా, తమిళనాడు కు చెందిన మోహన్, బాయ్ పూర్వ జాతీయ ఉపాధ్యక్షులు సచ్చిదానంద రెడ్డి, తెలంగాణ రాష్ట్ర బాయ్ చైర్మన్ రవిందర్ రెడ్డి, పూర్వ అధ్యక్షులు యు.సురేందర్,దేవేందర్ రెడ్డి,భాస్కర్ రెడ్డి, సంతోష్ రెడ్డి, నల్లగొండకు చెందిన డి.వి.ఎన్. రెడ్డి, మాజీ జాతీయ అధ్యక్షులు నిమేష్ డి పటేల్,ఈస్ట్ జాతీయ ఉపాధ్యక్షులు కౌశల్ కుమార్ సింగ్ ( జమ్షద్ పూర్) నార్త్ జాతీయ ఉపాధ్యక్షులు రవీంద్రా త్యాగి (ఘజియాబాద్) సౌత్ వన్ జాతీయ ఉపాధ్యక్షులు వేముల సత్యమూర్తి ( వరంగల్) సౌత్ టూ జాతీయ ఉపాధ్యక్షులు ఆర్ ప్రకాష్ ( కాంచీపురం) వెస్ట్ జాతీయ ఉపాధ్యక్షులు మహేష్ ఎం.ముడ్డా ( ముంబాయి) తదితర కార్యవర్గ సభ్యులకు పూర్వ జాతీయ అధ్యక్షులు రాజేంద్ర సింగ్ కాంబోజ్ నియామక పత్రాలను అందజేశారు.

శాలువాతో ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా సాగునీటి ప్రాజెక్టులు మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో వరంగల్ , తెలంగాణ ప్రాంత బిల్డర్ల పాత్రను ప్రముఖులు కొనియాడారు.వరంగల్, కరీంనగర్ మరియు హైదరాబాద్ సెంటర్ల నుండి పలువురు మేనేజింగ్ కమిటీ సభ్యులు మరియు బిల్డర్లు ఈ కార్యక్రమంలో పాల్గొని వేముల సత్యమూర్తిని అభినందించారు. వీరిలో ముఖ్యంగా కె. చంద్రశేఖర్ రెడ్డి (హైదరాబాద్),జి. సంతోష్ రెడ్డి (నల్గొండ) వంటి ప్రముఖులు ఉన్నారు.
ఇది ఇలా ఉండగా బాయ్ జాతీయ ఉపాధ్యక్షులుగా వేముల సత్యమూర్తి ఎంపిక కావడం పట్ల వర్ధన్నపేట మాజీ శాసన సభ్యులు వన్నాల శ్రీరాములు,వరంగల్ జిల్లా ప్రజా పరిషత్ మాజీ చైర్మన్ సాంబారి సమ్మారావు,తెలంగాణ ఆన్ లైన్ మీడియా వర్కింగ్ జర్నలిస్టుల అసోసియేషన్ రాష్ట్ర కోశాధికారి,
ఢీంబాయ్ టీవీ సీఈవో వేముల సదానందం నేత,గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వేముల నాగరాజు, పూర్వ అధ్యక్షులు గడ్డం కేశవమూర్తి, సీనియర్ జర్నలిస్టు వల్లాల వెంకట రమణ,ప్రముఖ బిల్డర్ బాల్నే శరత్ బాబు తదితరులు హర్షం వ్యక్తం చేశారు.