ముద్ర ప్రతినిధి, నిర్మల్:
విప్లవాత్మక సంస్కరణలు బీజేపీ తోనే సాధ్యమని, మోదీ హయాం లోని బీజేపీ ప్రభుత్వం అంతర్జాతీయంగా మన్ననలు అందుకుంటోందని బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎంఎల్ఏ ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. భారతీయ జనతా పార్టీ 47వ వ్యవస్థాపక దినోత్సవ సందర్భంగా జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి భారతీయ జనతా పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో అనేక విప్లవాత్మక సంస్కరణలు, ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి దేశాన్ని ప్రపంచంలో మూడో ఆర్థిక శక్తిగా నిలిపిన ఘనత భారతీయ జనతా పార్టీదన్నారు. పార్టీ స్థాపించినపుడు 2 స్థానాలతో మొదలైన బీజేపీ ప్రస్థానం వరుసగా మూడు సార్లు కేంద్రంలో అధికారంలోకి రావడం వరకు చేరిందన్నారు. ఇందులో కార్యకర్తల కృషి ఎంతో ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో సైతం అధికారంలో వచ్చే దిశగా కార్యకర్తలు సమిష్టిగా సమాయత్తం కావాలని సూచించారు. పల్లెల నుండి పట్టణాల వరకు పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్ రెడ్డి, సీనియర్ నాయకులు రావుల రాంనాథ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వి సత్యనారాయణ గౌడ్, పట్టణ అధ్యక్షులు సుంకరి సాయి, పట్టణ బీజేపీ కౌన్సిలర్లు,జిల్లా మరియు పట్టణ బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
పార్టీ కార్యాలయంలో…..
భారతీయ జనతా పార్టీ 47వ స్థాపన దివస్ సందర్భంగా నిర్మల్ జిల్లా పార్టీ కార్యాలయం లో బీజేపీ జిల్లా అధ్యక్షులు రితేష్ రాథోడ్ పతాకావిష్కరణ చేశారు. అనంతరం మాట్లాడుతూ “సబ్కా సాథ్ – సబ్కా వికాస్ – సబ్కా విశ్వాస్” అనే సిద్ధాంతంతో అన్ని వర్గాల అభ్యున్నతిని లక్ష్యంగా పెట్టుకుని బీజేపీ ముందుకు సాగుతోందన్నారు. చిన్న స్థాయి నుండి ప్రారంభమై ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా ఎదిగిన బీజేపీ ప్రయాణం ప్రతి కార్యకర్తకు ప్రేరణగా నిలుస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు అయ్యన్న గారి భూమయ్య, కూనింటి అంజకుమార్ రెడ్డి, మల్లికార్జున్ రెడ్డి, మెడిశెమ్మే రాజు, సామ రాజేశ్వర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు యాతాళం చిన్నారెడ్డి, నల్లా రవీందర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి మాదిరే శ్రీనివాస్, ఆఫీస్ కార్యదర్శి అల్లం భాస్కర్, పట్టణ అధ్యక్షులు సుంకరి సాయి, పట్టణ ప్రధాన కార్యదర్శులు కొండాజీ శ్రవణ్, గిల్లి విజయ్ ,పట్టణ ఉపాధ్యక్షులు ఒడ్నాల రాజు,బీజేపీ సీనియర్ నాయకులు ఆడెపు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.