Take a fresh look at your lifestyle.

రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు

 

కోరుట్ల, ముద్ర;
జగిత్యాల జిల్లా ఎస్పీ, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సోమవారం రోజు కథలాపూర్ మండలం తాండ్రియాల గ్రామంలో “అరైవ్ అలైవ్” కార్యక్రమంలో భాగంగా రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా బిటి రోడ్లు, స్థానిక రహదారులపై బ్లాక్ స్పాట్ లు, ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి ప్రమాదాల నివారణకు సమష్టిగా అవసరమైన నివారణ చర్యలు చేపట్టారు. ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా పాటిస్తామని, గ్రామస్తులతో ప్రతిజ్ఞ చేయించారు. గ్రామస్తుల సహకారంతో కొన్ని చోట్ల గుంతలు కూడా పూడ్చినట్లు కథలాపూర్ ఎస్సై రవి కిరణ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఏం. శంకర్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ రవి, ఆర్‌అండ్‌బీ, ఆరోగ్యశాఖల అధికారులు, గ్రామ పంచాయతీ సర్పంచ్ జంగ శివాని రంజిత్, ఉపసర్పంచ్ అల్లూరి జనార్ధన్ రెడ్డి, వార్డ్ సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.