Take a fresh look at your lifestyle.

దేవుడి భూములు కబ్జా చేస్తే పీడీ యాక్ట్

  • రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ హెచ్చ‌రిక‌.
  • చెంగిచెర్ల దేవుడి మాన్యాల‌ను ఆకస్మికంగా త‌నిఖీ. 
  • ఎండోమెంటు ల్యాండ్ల‌కి ఫెన్సింగ్ వేయించి ప‌రిర‌క్షించాల‌ని అధికారుల‌కు ఆదేశం.
ముద్ర, తెలంగాణ బ్యూరో: దేవాదాయ శాఖకు సంబంధించిన భూమిని కబ్జా చేసే వారిపై పీడీ యాక్టులు పెడ‌తామ‌ని సంబంధిత శాఖ మంత్రి కొండా సురేఖ హెచ్చరించారు. దేవుడి భూములు ప‌రిర‌క్షించ‌డ‌మే రాష్ట్ర ప్ర‌భుత్వ ధ్యేయమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వ‌చ్చిన మొద‌టి రోజు నుంచి దేవుడి భూములు కాపాడుతున్నామన్నారు.గురువారం మేడ్చల్ జిల్లా మేడిపల్లి మండలం బోడుప్పల్ కార్పొరేషన్ చెంగిచెర్లలో దేవాదాయ శాఖ భూమి అన్యాక్రాంతం అవుతున్నాయ‌న్న ఫిర్యాదు మేరకు మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్, మేడ్చల్ జిల్లా రెవెన్యూ, దేవాదాయ శాఖ అధికారులతో కలిసి ఆక‌స్మికంగా సంద‌ర్శించారు.ఈ సందర్భంగా కొండా సురేఖ మీడియాతో మాట్లాడుతూ. మేడ్చల్ జిల్లా మేడిపల్లి మండలం బోడుప్పల్ కార్పొరేషన్ చెంగిచెర్ల రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబరు 33/8 లో 10.33 ఎకరాలు, సర్వే నెంబరు 33/9 లో 13 ఎకరాలు, సర్వే నెంబరు 33/10 లో 6.33 ఎకరాల చొప్పున మొత్తం 30.28 ఎకరాల భూమిని 1968 లో టీఎల్పీ చారిటబుల్ ట్రస్ట్ కు భూ పట్టదారులైన తోటకూర ఎల్లయ్య యాదవ్, రామయ్య చౌదరి త‌దిత‌రుల ద్వారా సీలింగ్ యాక్ట్ నిబంధనల మేరకు సదరు భూమిని 1976 సంవత్సరంలో దేవాదాయ శాఖకు అప్పగించారని తెలిపారు. అప్ప‌టి నుంచి ఈ భూమి దేవాదాయ శాఖ ప‌రిధిలో ఉన్న‌ద‌ని అన్నారు. గ‌తంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వాలు ఈ భూమిని కాపాడుతూ వ‌చ్చాయ‌న్నారు.అయితే ఈ భూముల‌ను క‌బ్జా చేసేందుకు కొంతమంది ప‌ని చేస్తున్నార‌ని మంత్రి ఆగ్ర‌హించారు.దేవాదాయ శాఖ భూములు కబ్జాకు పాల్పడిందే ఎవ‌రైనా సరే వదిలే ప్రసక్తే లేదని మంత్రి సురేఖ హెచ్చ‌రించారు.అయితే, వీటిని కొంత‌మంది ప్ర‌యివేటు వ్య‌క్తులు క‌బ్జా చేసి విల్లాల నిర్మాణాలు చేప‌డుతున్న‌ట్టు త‌మ‌కు ఫిర్యాదులు వ‌చ్చాయ‌ని చెప్పారు. గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో స్థానిక ఎమ్మార్వోతో క‌ల‌సి కొంత‌మంది న‌కిలీ స‌ర్వే చేయించి అక్ర‌మంగా సొంతం చేసుకునే ప్ర‌య‌త్నం చేసిన‌ట్టు వివ‌రించారు.కాగా, తాజాగా ఏడీ స‌ర్వే చేయించ‌గా ఈ భూముల‌న్నీ దేవాదాయ శాఖ‌కు చెందిన భూములుగా తేలిన‌ట్టు మంత్రి సురేఖ పేర్కొన్నారు.వెంట‌నే రెవెన్యూ, దేవాదాయ‌, పోలీసు అధికారుల‌ను పిలిపించి త‌నిఖీలు చేప‌ట్టాల‌ని ఆదేశించారు.
  • గ‌త ప్ర‌భుత్వంలో దేవుడి భూముల‌పై నిర్ల‌క్ష్యం
గత ప్ర‌భుత్వ హ‌యాంలో దేవుడి భూముల‌పై నిర్ల‌క్ష్యం కొన‌సాగిందన్నారు.అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి  వచ్చిన తరువాత ఆల‌య భూములపై ఫోకస్ పెట్టామన్నారు. ఎక్కడెక్కడ భూములున్నాయో ఎన్ని వేల ఎకరాలు ఉన్నాయో అన్యాక్రాంతమైన జాగలెన్నో అనే లెక్కలు తీస్తున్నామన్నారు.రాష్ట్రంలో వివిధ ఆలయాల పరిధిలో మొత్తం 91,827 ఎకరాలున్నట్టు ఎండోమెంట్ గుర్తించిందని.. అందులో 25 వేల ఎకరాలు కబ్జా అయినట్టు నిర్ధారించిందన్నారు.మరో 6 వేల ఎకరాలు ఇతర రాష్ట్రాల పరిధిలో ఉన్నట్టు తేలిందని దేవాదాయ శాఖ అధికారులు చెబుతున్నారని పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.