Take a fresh look at your lifestyle.

నాణ్యమైన ధాన్యాన్ని 24 గంటల్లో రైస్ మిల్లులకు తరలించాలి

  • జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్.

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: యాసంగి పంటలో కొనుగోలు కేంద్రాలకు వచ్చే నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు చేసి 24 గంటల్లో రైస్ మిల్లులకు తరలించాలని జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ అధికారులకు సూచించారు.శనివారం మేడిపల్లి మండలం వల్లంపల్లి, దమ్మన్నపేట్, భీమారం మండలం వెంకట్రావుపేట్ ఐకెపి వరి ధాన్యం కేంద్రాలను, భీమారం మండలంలోని పి ఏ సి ఎస్, కోరుట్ల మండలం ఎకిన్ పూర్ పి ఏ సి ఎస్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా నాణ్యమైన ధాన్యం కొనుగోలు ప్రక్రియ జిల్లాలో జరగాలని అన్నారు.కొనుగోలు చేసిన ధాన్యానికి వెంటనే చెల్లింపులు పూర్తి చేయాలని అన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే ధాన్యం తేమ శాతం వివరాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ రికార్డు చేయాలని, తేమ శాతం వచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేసి 24 గంటల్లోగా రైస్ మిల్లులకు తరలించాలని, సెంటర్లలో అవకతవకలు జరిగినట్లయితే కఠిన చర్యలు తప్పవని సెంటర్ల నిర్వాహకులకు కలెక్టర్ హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో కోరుట్ల రెవెన్యూ డివిజనల్ అధికారి జివాకర్ రెడ్డి, డి ఆర్ డి ఓ రఘువరన్, డి సి ఓ మనోజ్ కుమార్, ఆయా మండలాల మండల ఎమ్మార్వోలు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.