కరీంనగర్ పట్టణ అభివృద్ధి కోసం మోడీ ప్రభుత్వం కట్టుబడి ఉంది.-బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి..
కరీంనగర్ పట్టణ అభివృద్ధి కోసం మోడీ ప్రభుత్వం కట్టుబడి ఉంది.
*కేంద్రం ఇచ్చిన స్మార్ట్ సిటీ నిధులతోనే పట్టణ రూపురేఖలు మారాయి…
*కరీంనగర్ నగరపాలక సంస్థ ను గతంలో కాంగ్రెస్ , బిఆర్ఎస్ లకు అప్పగిస్తే చేసిన అభివృద్ధి శూన్యం …
*బిజెపి అభ్యర్థులను జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో గెలిపించండి… కరీంనగర్ అభివృద్ధి కోసం మోడీ ప్రభుత్వం అండగా ఉంటుంది.
*50 వ డివిజన్ బిజెపి అడ్డ… బోయినపల్లి ప్రవీణ్ కుమార్ ను ఆశీర్వదించి గెలిపించండి…
బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి..

కరీంనగర్ పట్టణ అభివృద్ధి కోసం మోడీ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఆ దిశలోనే కరీంనగర్ కు స్మార్ట్ సిటీ హోదా ఇచ్చిందని, కేంద్రం ఇచ్చిన నిధులతోనే పట్టణ రూపురేఖలు మారాయని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు గుజ్జుల రామకృష్ణారెడ్డి అన్నారు. కరీంనగర్ పట్టణం 50 డివిజన్లో శుక్రవారం రోజున బిజెపి కార్పొరేటర్ అభ్యర్థి బోయినపల్లి ప్రవీణ్ కుమార్ తో కలిసి మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరీంనగర్ నగరపాలక సంస్థ అభివృద్ధి పట్ల కాంగ్రెస్ , బిఆర్ఎస్ లు నిర్లక్ష్యంగా వ్యవహరించాయన్నారు. కరీంనగర్ నగర పాలక సంస్థ ఆవిర్భా అనంతరం కాంగ్రెస్ కు అధికారం అప్పచెప్పిన, గతంలో రెండు పర్యాయాలు బిఆర్ఎస్ కు పట్టణాన్ని అప్పగిస్తే పట్టణ అభివృద్ధి కోసం చేసిందేమీ లేదని విమర్శించారు. కరీంనగర్ నగరపాలక సంస్థ బి ఆర్ ఎస్ చేతిలో ఉన్నా, కార్పొరేషన్ లో బిజెపి అధికారంలో లేకపోయినా కరీంనగర్ పట్టణం అభివృద్ధి చెందాలనే ఏకైక సంకల్పంతో మోడీ ప్రభుత్వం కరీంనగర్కు స్మార్ట్ సిటీ హోదా ఇచ్చిందని తెలిపారు. కరీంనగర్కు స్మార్ట్ సిటీ హోదా లభించిన అనంతరం కేంద్ర ప్రభుత్వం వందల కోట్ల నిధులను పట్టణ అభివృద్ధి కోసం కేటాయించిందన్నారు. కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి కోసం ఇచ్చిన నిధులతోనే పట్టణ రూపురేఖలు మారాయన్నారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన గత బిఆర్ఎస్, నేటి కాంగ్రెస్ ప్రభుత్వానికి జరగబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలన్నారు. కరీంనగర్లో బిఆర్ఎస్ కు ఓటు వేయడం దండగన్నారు. ఆరూ గ్యారెంటీలు, అడ్డగోలు హామీలతో ప్రజానీకాన్ని మోసం చేసిన కాంగ్రెస్ కి ఓట్లు అడిగే హక్కు లేదన్నారు. మోసానికి బ్రాండ్ అంబాసిడర్ గా కాంగ్రెస్ మారిందని, అలాంటి కాంగ్రెస్కు. ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలన్నారు.2014 లో అధికారంలోకి వచ్చిన బిజెపి మోడీ ప్రభుత్వం పట్టణాల అభివృద్ధి కోసం కట్టుబడి పనిచేస్తుందన్నారు.మున్సిపాలిటీల అభివృద్ధి కేవలం బిజెపితోనే సాధ్యమన్నారు. కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ సహాయ సహకారాలతో , కేంద్ర ప్రభుత్వం నిధులతో మున్సిపాలిటీలను అభివృద్ధి చేసే బాధ్యత బిజెపి తీసుకుంటుందని, జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులకు ఆకాశం ఇవ్వాలని కోరారు.బి, ఆర్ ఎస్ , కాంగ్రెస్ పాలనపై ప్రజలు విసిగిపోయి ఉన్నారని , ప్రజలంతా నేడు బిజెపి వైపు చూస్తున్నారన్నారు. కరీంనగర్ లోని 50 వ డివిజన్ బిజెపి అడ్డ అన్నారు. ఇక్కడ డివిజన్ నుండి బిజెపి అభ్యర్థిగా పోటీ చేస్తున్న బోయిన్పల్లి ప్రవీణ్ కుమార్ ను ఆశీర్వదించి గెలిపించాలని ఆయన కోరారు. కరీంనగర్ కార్పొరేషన్ పై కాషాయ జెండా ఎగరవేసే లక్ష్యంగా బిజెపి శ్రేణులు పనిచేయాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.