Take a fresh look at your lifestyle.

డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకు మౌలిక వసతులు కలిపిస్తాం: ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: నూకపల్లి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకు మౌలిక వసతులు కలిపిస్తామని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అన్నారు.జగిత్యాల నూకపల్లి సరస్వతి గుట్ట పైన డబల్ బెడ్ రూం ఇండ్ల లబ్ధిదారుల కోసం రూ. 14 కోట్ల తో నిర్మించిన 14 లక్షల లీటర్ల వాటర్ ట్యాంక్, పైప్ లైన్ నిర్మాణ పనులను తాజా మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ ఆడువల జ్యోతి లక్ష్మణ్ లతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత 500 ఇండ్ల ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు,4500 డబల్ బెడ్ రూం ఇండ్ల లబ్ధిదారులకు సరస్వతి గుట్ట పైన 14 లక్షల లీటర్ల ట్యాంక్,మిషన్ భగీరథ, పాత వాటర్ ట్యాంక్ ల ద్వారా లబ్ధిచేకూరనుంది అని,అతి త్వరలో లబ్ధిదారులు వారికి కేటాయించిన ఇండ్ల లో నివాసం ఉండేవిధంగా మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకున్నామన్నారు.నిరుపేదలకు 200 యూనిట్ల కరెంటు ఉచితమని,1 కేవి విద్యుత్ మీ కనెక్షన్ ను లబ్ధిదారులు 1700 రూపాయలతో తీసుకోవాలని,ఇండ్లు పొందిన లబ్ధిదారులు వారంలో రావడానికి సిద్ధంగా ఉండాలన్నారు.పరిశుభ్రత,పచ్చదనం, నీరుపొదుపుగా వాడడం ప్రజల భాధ్యత అన్నారు.
మిగిలిన 770 ఇండ్లకు త్వరలో లబ్ధిదారుల ఎంపిక చేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ ఏ ఎం సి ఛైర్మెన్ దామోదర్ రావు, కమిషనర్ చిరంజీవి, డి ఇ జలంధర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ లు క్యాధసు నవీన్, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.