Take a fresh look at your lifestyle.

ఎల్ఆర్ఎస్ ఫీజు, ఇంటి పన్ను వసూలు త్వరితగతిన పూర్తి చేయాలి

  • మార్చి 31 లోపు ఎల్ఆర్ఎస్ ఫీజు వసూలు పూర్తిచేసేలా పటిష్ట కార్యాచరణ అమలు చేయాలి.
  • వంద శాతం పన్ను వసూలు చేయడంపై ప్రత్యేక దృష్టి సారించాలి.
  • జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్.

కోరుట్ల, ముద్ర: జగిత్యాల జిల్లాలోని కోరుట్ల మెట్పల్లి పట్టణంలోని మార్చి 31 లోపు ఎల్ఆర్ఎస్ ఫీజు వసూలు పూర్తిచేసేలా పటిష్ట కార్యాచరణ అమలు చేయాలని జిల్లా కలెక్టర్ అన్నారు.గురువారం రోజున కోరుట్ల, మెట్పల్లి మున్సిపాలిటీ పరిధిలో ఇంటి పనుల వసూలు ఎల్ఆర్ఎస్ పనులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు.కోరుట్ల పట్టణంలో అత్యధికంగా ఇంటి పనులు బకాయిలు ఉన్న షాపింగ్ మాల్ లను సందర్శించి, రెండు రోజులలో బకాయిలు చెల్లించాలని లేకపోతే సీజ్ చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కోరుట్ల పట్టణంలో 80 శాతం ఇంటి పన్ను వసూలు చేశారన్నారు.ఈ నెల 31 వరకు ఉన్న గడువు లోపల వంద శాతం ఇంటి పన్ను వసూలు చేయడానికి లక్ష్యంగా పెట్టుకున్నట్లు, గడువు లోపల ఇంటి పన్ను బకాయి చెల్లించాలని లేదంటే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మార్చి 31 వరకు 20 శాతం రాయితీ ఉపయోగించుకొని అందరూ ఎల్ఆర్ఎస్ చెల్లించి రెగ్యులరైజ్ చేసుకోవాలని అన్నారు.రెగ్యులర్ చేసుకున్న వారికి వెంటనే సర్టిఫికెట్స్ జారీ చేయడం జరుగుతుందని అన్నారు.కోరుట్ల పట్టణంలో 46 మంది ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను నిబంధన ప్రకారం ఆమోదించడం జరిగిందని,మిగతా వారిని కూడా ఈ నెల 31 లోగా చెల్లించేలా సమాచారం అందించామన్నారు.పట్టణ ప్రజలు అభివృద్ధికి సహకరించాలని అందరూ తమ ఆస్తి పనులను ఇతర మున్సిపల్ పన్నులను చెల్లించాలని సూచించారు.వంద శాతం పన్ను వసూలు చేయడంపై ప్రత్యేక దృష్టి సారించాలని, మున్సిపల్ కమిషనర్, బిల్ కలెక్టర్, వార్డ్ అధికారులకు సూచించారు.అనంతరం కోరుట్ల పట్టణంలోని అర్బన్ ప్రైమరీ యుపిహెచ్సి హెల్త్ సబ్ సెంటర్ పనులను అధికారులతో కలిసి పరిశీలించి,నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు.కలెక్టర్ వెంట ఆర్డిఓ లు జీవాకర్ రెడ్డి, శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్లు రామకృష్ణ, మోహన్, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.