Take a fresh look at your lifestyle.

మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను  కలిసిన జిల్లా కలెక్టర్ 

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: ఇటీవల మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ధర్మపురికి వచ్చిన  అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను బుధవారం జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ మర్యాదపూర్వకంగా కలిశారు. ధర్మపురి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రిని జిల్లా కలెక్టర్ కలిశారు. ఈ సందర్భంగా మంత్రికి కలెక్టర్ పూల మొక్కను అందించి అభినందనలు తెలిపారు. ధర్మపురి ఎమ్మెల్యే అయిన లక్ష్మణ్ కుమార్ మంత్రిగా పదవి ప్రమాణ స్వీకారం చేయడం ఆనందంగా ఉందని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా మంత్రి లక్ష్మణ్ కుమార్ ఆధ్వర్యంలో మరింత ప్రగతి పథంలో పయనిస్తుంది అని తెలిపారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి అంశాలు, సంక్షేమ కార్యక్రమాల అమలుపై మంత్రితో జిల్లా కలెక్టర్ చర్చించారు.

Leave A Reply

Your email address will not be published.