Take a fresh look at your lifestyle.

12న దేశవ్యాప్త కార్మికుల సమ్మెను జయప్రదం చేయాలి : భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్

ముద్ర ప్రతినిధి, భువనగిరి :
ఈ నెల 12న దేశవ్యాప్త కార్మికుల సమ్మెను జయప్రదం చేయాలని భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల మారయ్య పిలుపునిచ్చారు. శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ సమావేశంలో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ రద్దు చేయాలి అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. కార్మికులందరూ సమ్మెలో పాల్గొని తన హక్కుల సాధనకై కార్మిక సంఘాలు ఇచ్చే పిలుపులో భాగస్వాములు కావాలన్నారు. జిల్లా అధ్యక్షులు ఢిల్లీ మాధవరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో బి ఆర్ టి యు రాష్ట్ర ఉపాధ్యక్షులు సిరివెళ్ల ప్రభాకర్, ఆశా వర్కర్ల యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు సంతోష్, మున్సిపల్ యూనియన్ అధ్యక్షులు నరేష్, భువనగిరి మున్సిపల్ మాజీ చైర్మన్ ఆంజనేయులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.