Take a fresh look at your lifestyle.

కార్పొరేటర్లతో వెళ్లి జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ ను కలిసిన వెలిచాల రాజేందర్ రావు

 

ఇటీవల నూతనంగా ఎన్నికైన కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ కార్పోరేటర్లు, కాంటెస్టెడ్ అభ్యర్థులతో వెళ్లి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, పోలీస్ కమిషనర్ గౌష్ ఆలంను కరీంనగర్లో కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు మంగళవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ పూల మొక్కలను అందించారు. అనంతరం పలు అంశాలపై జిల్లా కలెక్టర్ సిపితో రాజేందర్ రావు చర్చించారు. రాష్ట్రంలోనే కరీంనగర్ జిల్లాకు ప్రత్యేక గుర్తింపు తీసుకొస్తున్నారని ఇంకా మరింత ప్రగతి పథంలో పరుగులు పెట్టేలా మరిన్ని వినూత్న కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ దృష్టికి రాజేందర్రావు తీసుకొచ్చారు. కరీంనగర్ జిల్లాలో శాంతిభద్రతలు బేష్ గా ఉన్నాయని సిపి గౌష్ ఆలం కృషి ఎంతో ఉందని రాజేందర్రావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్పోరేటర్లు, కాంటెస్టెడ్ అభ్యర్థులు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.