Take a fresh look at your lifestyle.

ఫెర్టిలైజర్స్ డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా కమిటీ ఎన్నిక

 

ఫెర్టిలైజర్స్, ఫెస్టిసైడ్స్ అండ్ సీడ్స్ డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు నాగూర్ల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో శనివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని టిపిఆర్ ఫంక్షన్ హాలులో ఫెర్టిలైజర్స్, ఫెస్టిసైడ్స్ అండ్ సీడ్స్ డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా గౌరవ అధ్యక్షులుగా యాంసాని వెంకటేశ్వర్లు, ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ అండ్ సీడ్స్ డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులుగా కట్కం అశోక్, ఉపాధ్యక్షులుగా నలిగేటి సతీష్, ప్రధాన కార్యదర్శిగా పుప్పాల రాజు, కోశాధికారిగా కందునూరి శ్రీనివాస్, గౌరవ సలహాదారులుగా తొగరి శ్రీనివాస్, తడకల జగదీష్, కార్యనిర్వాహక కార్యదర్శిగా ఒల్లాల రాంబాబు, కార్యదర్శిగా లింగంపల్లి తిరుపతి, సహాయ కార్యదర్శిగా లింగంపల్లి బాబురావులతోపాటు మరో 22 మందిని కమిటీ సభ్యులుగా నియమించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు నాగూర్ల వెంకటేశ్వర్లు నూతన కమిటీ సభ్యులకు నియామక పత్రాలు అందజేశారు. అనంతరం రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన జిల్లా కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు. నూతన కమిటీ జిల్లాలోని ఫెర్టిలైజర్స్ అసోసియేషన్ బలోపేతానికి కృషి చేయాలని, జిల్లాలో డీలర్లకు ఏవైనా సమస్యలు ఎదురైనట్లయితే ముందుండి పోరాడాలని సూచించారు. అనంతరం నూతన కమిటీ సభ్యులచేత ప్రమాణ స్వీకారం చేపించారు. ఈ కార్యక్రమంలో ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ అండ్ సీడ్స్ డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లాలోని అన్ని మండలాల అధ్యక్ష కార్యదర్శులు, డీలర్లు, అన్ని కంపెనీల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.