యైటింక్లయిన్ కాలనీ, ముద్ర: భారతీయ మజ్దూర్ సంఘ్ (బిఎంఎస్) 70వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని, రామగుండం రీజియన్ సంఘ్ సభ్యులు బుధవారం రామగుండం రెండవ ఏరియా గనులపై సంఘం జెండాలు ఎగురవేశారు. సంఘ్ రాష్ట్ర అధ్యక్షులు యాదగిరి సత్తయ్య ఆధ్వర్యంలో ఏరియా నాయకులు, స్తానిక ప్రతినిధులు ఉదయం ఓసీపీ.3, ప్రాజెక్ట్ లో, వకీల్ పల్లి గనిపై, వివిధ డిపార్ట్మెంట్లలో కాషాయం రంగు పార్టీ జెండాలు ఎగురవేశారు. వేరువేరుగా జరిగిన ఈ కార్యక్రమాల్లో బిఎంఎస్ ప్రధాన కార్యదర్శి వై. సారంగపాణి, ఉప ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ రావు, ఏరియా ఉపాధ్యాక్షులు వడ్డేపల్లి కుమారస్వామి, కార్యదర్శి గట్టు శ్రీనివాస్, కందుల నరహరి, లింగం నాయక్, తదితరులు పాల్గొన్నారు.