Take a fresh look at your lifestyle.

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి

  • నిమ్స్ లో కార్పొరేట్ వైద్య.
  • టి యు డబ్ల్యు జె జిల్లా అధ్యక్షుడు రజనీకాంత్.

ముద్ర ప్రతినిధి, కామారెడ్డి: జిల్లాలోని జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని టి యు డబ్ల్యు జె జిల్లా అధ్యక్షుడు రజనీకాంత్ పేర్కొన్నారు. గురువారం బాన్సువాడ లోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో జరిగిన ప్రెస్ క్లబ్ సమావేశంలో మాట్లాడుతూ జర్నలిస్టుల కు అక్రిడిటేషన్ కార్డులు, ఇండ్ల స్థలాలు మంజూరు చేసేందుకు స్థానిక ఎమ్మెల్యేల దృష్టికి తీసుకెళ్తామని, ఇందుకు జర్నలిస్ట్ మిత్రులు కూడా ఐక్యం గా ఉండి సమస్యలు విన్నవించాలని అన్నారు. జర్నలిస్టులకు హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించుకోవడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చే నాయకులను గుర్తించాలని అన్నారు. హెల్త్ కార్డు, రేషన్ కార్డు గల జర్నలిస్టుల కు ఆరోగ్య సమస్యలు ఉంటే సాధ్యమైనంత వరకు నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స చేయించుకోవాలని అన్నారు. మండలాల్లో జర్నలిస్టులు కమిటీలు ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. బాన్సువాడ ప్రెస్ క్లబ్ సభ్యులు ఏకంగా ఉండి సమస్యలు సాధిస్తారని ప్రశంసించారు. ఈ సందర్భంగా కొత్తగా బాన్సువాడ ప్రెస్ క్లబ్ కార్యవర్గాన్ని ఎన్నుకోగా, అధ్యక్షుడు సుధాకర్ గౌడ్, కార్యదర్శి చందు, ఉపాధ్యక్షుడు సుందర్, సహాయ కార్యదర్శి సలీం తదితరులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు శ్రీనివాస్, రాజేశ్, ముదాం శంకర్, సంగాయప్ప, వీరప్ప, మెయిన్, రాజేశ్వరి రెడ్డి, సుధాకర్, పొషీరామ్, సుభాష్, అహ్మద్, యూనిస్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.