Take a fresh look at your lifestyle.

గురువును సత్కరించిన కాషాయవాదుల

యైటింక్లయిన్ కాలనీ, ముద్ర: గురుపూర్ణిమ దినోత్సవాన్ని పురస్కరించుకుని, పట్టణ బిజెపి సభ్యులు గురువారం విద్యాబుద్ధులు నేర్పిన గురువును ఘనంగా సత్కరించారు. బిజెపి పార్టీ మండల శాఖ అధ్యక్షులు ఆకుల శశి కుమార్ ఆధ్వర్యంలో ఉదయం స్తానిక శ్రీవాణి పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ సభ్యులు గురువులు, పాఠశాల కరస్పాండెంట్ జి. లక్ష్మణ్ కుమార్ ను శాలువాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం అధ్యక్షులు శశి కుమార్ మాట్లాడుతూ.. గురువును మించిన దైవం లేదని, పెద్దలు చెప్పిన మాటలను గుర్తు చేస్తూ.. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వరహ, గురు సాక్షాత్ పరః బ్రహ్మ తస్మయిశ్రీ గురవేనమః కావున, విద్యార్థిని విద్యార్థులు క్రమశిక్షణ తో చదువు కొని ఉన్నత స్థాయికి ఎదగాలని, గురువును గౌరవించటం నేర్చుకో వాలన్నారు. ఇంకా ఈ కార్యక్రమం లో బిజెపి సీనియర్ నాయకులు మూకిరి రాజు, ఆకుల కుమార్, పొట్ల వెంకటేష్, లింగం నాయక్, గంధం శంకర్, అంకం కుమార్, దాసరి శ్రీనివాస్, జంజర్ల శ్రీనివాస్, అనిల్ కుమార్, నాగేంద్రం, దావ రాజిరెడ్డి, దూడపాక కుమార్, అఖిల్, గణేష్, పాఠశాల ప్రిన్సిపాల్ మానస సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.