Take a fresh look at your lifestyle.

పదిలో శత శాతం ఉత్తీర్ణతకు ప్రయత్నం తల్లిదండ్రుల వద్దకు ఉపాధ్యాయులు

ముద్ర ప్రతినిధి, మెదక్:
పదవ తరగతి పరీక్షలు సమీపిస్తున్నందున రాజ్ పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాఠశాల పరిధిలోగల వివిధ గ్రామాలను రాత్రి సమయంలో 8 గంటల నుండి 10 గంటల వరకు విద్యార్థుల గృహాలను సందర్శిస్తూ ఉదయం, సాయంత్రం విద్యార్థులు చదివేలా ప్రోత్సహిస్తున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడుతూ వారికి ప్రశాంతమైన వాతావరణం, ప్రత్యేకమైన గది ఉండేలా చూడాలని సమయసారిణి తయారుచేసి ఇచ్చారు. తల్లిదండ్రుల సహకారంతో శత శాతం ఉత్తీర్ణత సాధించే విధంగా ఉపాధ్యాయులకు కృషి చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు జి. శ్రీనివాస్, ఉపాధ్యాయలు యాదగిరి, సాయిలు తదితరులు పాఠశాల పరిధిలో గల తిమ్మక్కపల్లి, తిమ్మక్కపల్లి తండాను సందర్శించారు.

Leave A Reply

Your email address will not be published.