Take a fresh look at your lifestyle.

తాడూర్ మండలం సిరసవాడ జడ్‌పీహెచ్‌ఎస్‌లో స్పోర్ట్స్ డ్రెస్సుల పంపిణీ ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్

 

ముద్ర ప్రతినిధి,నాగర్ కర్నూలు:

 

నాగర్ కర్నూలు జిల్లా తాడూర్ మండలం సిరసవాడ జిల్లా పరిషత్ హైస్కూల్‌లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో స్పోర్ట్స్ డ్రెస్సులను విద్యార్థులకు పంపిణీ చేశారు. సుమారు ₹17,000 విలువైన ఈ డ్రెస్సులను విద్యార్థులకు అందజేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ గవర్నర్ రాధాకృష్ణ హాజరై విద్యార్థులకు మార్గదర్శకంగా మాట్లాడారు. చదువుతో పాటు సేవాభావాన్ని కూడా అలవాటు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.
లయన్స్ క్లబ్ ద్వారా పాఠశాలలకు వాటర్ ట్యాంక్‌ల పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామని, అవసరమైతే సభ్యులను సంప్రదించాలని తెలిపారు. దాతల సహకారంతోనే ఇలాంటి సేవా కార్యక్రమాలు సాధ్యమవుతున్నాయని క్లబ్ అధ్యక్షుడు నరేందర్ రెడ్డి తెలిపారు.
ఈ కార్యక్రమానికి ఆర్థిక సహకారం అందించిన వాస రాఘవేందర్, నాగరాణి కి కృతజ్ఞతలు తెలిపారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు అల్లంపల్లి రమేష్ కార్యక్రమాన్ని అభినందించారు. రాధాకృష్ణ గారి పాల్గొనడంపై ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.