ముద్ర ప్రతినిధి, పెద్దపల్లి: రూ.4 కోట్ల 20 లక్షల రూపాయలతో నిర్మించే సమీకృత మార్కెట్ పనులకు శుక్రవారం రాష్ట్ర హౌసింగ్ రెవెన్యూ పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఐటి పరిశ్రమల శాఖ మంత్రి దుదిల్ల శ్రీధర్ బాబు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో కరీంనగర్ సుధా చైర్మన్ కే నరేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, ఎమ్మెల్యేలు చింతకుంట విజయ రమణారావు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, ఎమ్మెల్సీ భాను ప్రసాద్ రావు, రామగుండం పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్, డిసిపి కరుణాకర్, అదనపు కలెక్టర్లు డి.వేణు, జే.అరుణశ్రీ, రెవెన్యూ డివిజన్ అధికారి బి.గంగయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అన్నయ్య గౌడ్ , ప్రజా ప్రతినిదులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
