- అదనపు కలెక్టర్ బి.ఎస్ లత.
ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జిల్లాలో నిర్వహించు రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ బి.ఎస్ లత సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం అదనపు కలెక్టర్ బి.ఎస్ లత సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల ఏర్పాట్ల పై సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు సమీకృత జిల్లా కలెక్టరేట్ లో జరుగుతాయని, జిల్లాలోని ప్రతి శాఖకు చెందిన అధికారులు , సిబ్బంది వేడుకలకు తప్పనిసరిగా హాజరు కావాలని అదనపు కలెక్టర్ తెలిపారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు సంబంధించి ఫ్లాగ్ ఏర్పాట్లు, గ్రౌండ్ సిద్దం చేయడం మొదలగు ఏర్పాట్లు పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ అధికారులు సమన్వయంతో పూర్తి చేయాలని అన్నారు. రాష్ట్ర అవతరణ వేడుకల డయాస్ , సీటింగ్ ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ ఆర్ అండ్ బీ అధికారులను ఆదేశించారు. ప్రోటోకాల్ ప్రకారం సీటింగ్ ఏర్పాట్లు చేయాలని, అన్నారు. వేడుకల వద్ద ఏ.ఎన్.ఏం ఆధ్వర్యంలో వైద్య బృందాలచే వైద్య శిభిరాలు ఏర్పాటు చేయాలని, అవసరమైన మేర త్రాగు నీటి సరఫరా పనులు మున్సిపల్ కమిషనర్ ఏర్పాటు చేయాలని, వేడుకలకు ఆహ్వాన పత్రాలు ప్రోటోకాల్ ప్రకారం ప్రతి ఒక్కరికీ అందాలని అన్నారు. జగిత్యాల పట్టణంలోని స్వశక్తి మహిళా సంఘాల ప్రతినిధులు హజరయ్యేలా మెప్మా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. ముఖ్య అతిథి అందించే సందేశం రూపొందించేందుకు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల వివరాలను క్లుప్తంగా మే 28 నాటికి సాయంత్రం నాటికి అందజేయాలని అన్నారు. ముఖ్య అతిథి గౌరవ వందనం, ఇతర బందోబస్తు ఏర్పాటు పకడ్బందిగా చేయాలని అన్నారు. ఈ సమావేశంలో జగిత్యాల జిల్లా అదనపు, ఎస్పీ భీమ్ రావు వివిధ జిల్లా శాఖల అధికారులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.