ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జిల్లా షీ టీం, బరోసా టీం ఆధ్వర్యంలో జగిత్యాల పట్టణంలోని మానస హైస్కూల్ లో శిక్షణ పొందుతున్న ఉపాధ్యాయులకు మహిళల రక్షణ, మహిళా చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా పిల్లలు, మహిళలు అనుభవించే వేధింపులు, హింసకు చట్ట పరంగా ఉన్న పరిష్కారాలను వివరించారు. అవసరమైనప్పుడు పోలీసుల సహాయాన్ని తీసుకోవాలంటూ సూచించారు. నేరుగా సంప్రదించలేని వారు షీ టీం నెంబర్ లో 8712670783 సంప్రదించాలని అన్నారు. ఉపాధ్యాయులు మంచి సమాజాన్ని రూపోందించే ముఖ్యమైన స్థంభాలని అభివర్ణించారు. పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మహిళా చట్టాలు, లైంగిక వేధింపుల నివారణ చట్టం (పోక్సో ఆక్ట్ ), వంటి చట్టాలపై అవగాహన కలిగించాలన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థుల నైతిక అభివృద్ధికి మద్దతుగా ఉండాలని వారు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటిని చట్టబద్ధంగా పరిష్కరించే దిశగా ముందడుగు వేయాలన్నారు. ఈ కార్యక్రమంలో భరోసా సెంటర్ కోఆర్డినేటర్ అనూష , సపోర్ట్ పర్సన్స్ సుజాత, సౌజన్య మహిళా కానిస్టేబుల్ లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
