Take a fresh look at your lifestyle.

“మూడో మహాసభను జయప్రదం చేయాలి ”

రామకృష్ణాపూర్, ముద్ర విలేకరి : జూన్ ఒకటో తేదీన నిర్వహించే సీపీఐ పట్టణ మూడో మహాసభను జయప్రదం చేయాలని పట్టణ కార్యదర్శి మిట్టపెల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక సీపీఐ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జిల్లా కార్యవర్గ సభ్యులు ఇప్పకాయల లింగయ్య,వనం సత్యనారాయణ మాట్లాడారు.స్థానిక సూపర్ బజార్, ఠాగూర్ స్టేడియం మీదుగా సివి రామన్ పాఠశాల వరకు మహా ప్రదర్శన చేపడుతున్నట్లు తెలిపారు. అనంతరం పట్టణ కమిటీని ఎన్నుకోవడం జరుగుతుందన్నారు. పౌలు, సంపత్, కమలమ్మ, మణెమ్మ, గురవయ్య, మొండి, శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.