ముద్ర, భువనగిరి ప్రతినిధి :
భువనగిరి మండలంలోని నాగిరెడ్డిపల్లి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు మహాధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ఘోరంగా విఫలమయిందన్నారు. యాసంగి పంటకు సకాలంలో యూరియా సరఫరా చేయకుండా యాప్ ద్వారా రైతులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. పంట పెట్టుబడి సాయం కింద రైతుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు విడుదల చేయాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి రైతుల ద్రోహి అని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు, తుక్కాపురం సర్పంచ్ జనగాం పాండు, బిఆర్ఎస్ మండల పార్టీ ప్రధాన కార్యదర్శి నీల ఓంప్రకాష్ గౌడ్, మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు జక్కా రాఘవేందర్ రెడ్డి, చందుపట్ల మాజీ సింగిల్విండో చైర్మన్ భల్గూరి మధుసూదన్ రెడ్డి, సర్పంచులు పడాల వెంకటేశ్వర్లు, తోటకూరి శంకరయ్య, కంకల లలిత కిష్టయ్య, ర్యాకల సంతోష శ్రీనువాస్, నాగెళ్లి గిరిజ రమేష్ గౌడ్, కొండూరి దానమ్మ సత్యనారాయణ గౌడ్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు అబ్బగాని వెంకట్ గౌడ్, మద్ది బుచ్చి రెడ్డి, చిందం మల్లికార్జున్, సుబ్బూరు రమేష్, రాసాల మల్లేశం, నోముల మహేందర్ రెడ్డి, అంకర్ల మురళి, చిన్నం పండు, కడమంచి ప్రభాకర్, మట్ట ధనుంజయ్య, చింతల శంకర్ గౌడ్, సుధాకర్ నాయక్, సాబాన్కార్ వెంకటేష్, కునుసోత్ రెడ్డి నాయక్, కూనూరు ఆంజనేయులు, పడమటి జైపాల్ రెడ్డి, జిట్టా లక్ష్మా రెడ్డి, చింతల వెంకట్ రెడ్డి, ఎలిమినేటి విఠల్ రెడ్డి, షేర్ ఖాన్, పోల ప్రవీణ్, పిన్నింటి మధు రెడ్డి, చింతల దేవేందర్, నల్లమాస రాజు, జనగాం మహేష్, రాసాల లింగ స్వామి పాల్గొన్నారు