ముద్ర, మేడ్చల్ జిల్లాప్రతినిధి :
ప్రజావాణిలో స్వీకరించిన దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులకు అందజేస్తూ జాప్యం లేకుండా సత్వరమే అర్జీలను పరిశీలించి పరిష్కరించాలని మేడ్చల్ మల్కాజిగిరి అదనపు జిల్లా కలెక్టరు విజయేందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
సోమవారం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారులను డిఆర్ఓ (ఇంఛార్జి) చంద్రవతి లతో కలిసి అదనపు కలెక్టరు 153 దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హౌజింగ్ డిపార్టుమెంట్ కు అధిక సంఖ్యలో (53) దరఖాస్తులు వచ్చాయని అన్నారు. ఎంతో వ్యయ, ప్రయాసలకోర్చుకొని వారి సమస్యలను పరిష్కరిస్తామనే నమ్మకంతో ప్రజలు మన వద్దకు వస్తారని, వారి నమ్మకాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత మనందరి పైన ఉన్నదని అదనపు కలెక్టర్ తెలిపారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని దరఖాస్తుల పరిశీలనలో ఎలాంటి జాప్యం లేకుండా చూడాలని ఆదేశించారు. అదేవిధంగా తిరస్కరించే దరఖాస్తుల గురించి తిరస్కరణకు గల కారణాలను తప్పనిసరిగా వివరంగా అర్జీదారులకు తెలియజేయాలని అధికారులకు సూచించారు. స్వీకరించిన దరఖాస్తులపై తీసుకున్న చర్యల వివరాలను ఆన్ లైన్ లో వెంట వెంటనే నమోదు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Naresh is a Asst Editor and he is working with our organisation and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.