Take a fresh look at your lifestyle.

పార్టీ లకు అతీతంగా భువనగిరి మున్సిపల్ అభివృద్ధి చేస్తా : చైర్ పర్సన్ తంగెళ్లపల్లి శ్రీవాణి రవి కుమార్

ముద్ర ప్రతినిధి, భువనగిరి :
పార్టీ లకు అతీతంగా భువనగిరి మున్సిపల్ అభివృద్ధి చేస్తానని మున్సిపల్ చైర్ పర్సన్ తంగెళ్లపల్లి శ్రీవాణి రవి కుమార్ అన్నారు. మంగళవారం భువనగిరి మున్సిపల్ చైర్మన్ తాంగ్గెళ్లపల్లి శ్రీవాణి రవి కుమార్ ని పుర ప్రముఖులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా చైర్మన్ మాట్లాడు తు పార్టీ లకు అతీతంగా భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి నాయకత్వం లో భువనగిరి మున్సిపల్ అభివృద్ధి చేస్తానని తెలిపారు. 17 వార్డ్ కౌన్సిలర్ చెన్న స్వాతి మహేష్ చైర్ పర్సన్ ని సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రవి, సురేష్ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.