– నారాయణ పేట ఎమ్మెల్యే పర్ణిక రెడ్డి ఒక్కరే ఫేయిల్
– 8 మంది కాంగ్రెస్, ఒక్క బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యే సక్సెస్
– మున్సిపాలిటీ ఎన్నికల్లో సత్తా చాటిన ఆయా నియోజకవర్గా ల ఎమ్మెల్యే లు
– జిల్లా లో ఒకే ఒక మేయర్ పదవి దక్కించుకోవడం లో ఎమ్మెల్యే యెన్నం సక్సెస్ మంత్రం
– ఉమ్మడి జిల్లా లో ని మున్సిపాలిటీ లలో సఫలమైన మంత్రులు, ఎమ్మెల్యే లు
……………………………………..
ముద్ర, ఉమ్మడి
మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి :
………………………………………
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా లోని 10 నియోజకవర్గాల్లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ ఎమ్మెల్యే లు తమ సత్తా చాటి కాంగ్రెస్ పార్టీ కి పూర్వ వైభవం తెచ్చారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లా లో 12 నియోజకవర్గాలు ఉన్నా జడ్చర్ల,అచ్చంపేట నియోజకవర్గం లోని మున్సిపాలిటీ లకు ఎన్నిక జరగ లేదు. ఇక్కడి మున్సిపాలిటీ పాలక గడువు ఇంకా ముగియక పోవడం తో ఎన్నిక జరగలేదు. మిగతా 10నియోజకవర్గాల్లో ని మున్సిపాలిటీ లకు జరిగిన ఎన్నికల్లో 8 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యే లు, ఒక బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యే తమ అభ్యర్థులను గెలిపించు కోవడం లో సక్సెస్ అయ్యారు. కానీ అధికార పార్టీ కి చెందిన నారాయణ పేట ఎమ్మెల్యే పర్ణిక రెడ్డి మాత్రం తన పరిధి లోని మున్సిపాలిటీ ని దక్కించుకోలేక పోయింది. ఇక్కడి మున్సిపాలిటీ పై కాషాయ జెండా రెపరెపలాడింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉండి బీజేపీ గెలవడం తో ఎమ్మెల్యే పర్ణిక పై విమర్శలు వస్తున్నాయి. కానీ ఆమె కాలుకు నొప్పి ఉండడం తో వైద్యులు విశ్రాంతి తీసుకోమని చెప్పడం తో ఆమె మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రచారం కూడా చేయలేదు. ఆమె హైదరాబాద్ కు పరిమితం కావడం తో ఆమె మేనమామ,డీసీసీ మాజీ అధ్యక్షులు కుంభం శివకుమార్ రెడ్డి ఈ ఎన్నికల్లో అన్నీ తానై చూసుకున్నా మున్సిపాలిటీ ఎన్నికల్లో బోల్తా కొట్టారు. ఈ స్థానం బీజేపీ కి దక్కడం తో ఎమ్మెల్యే పై కాంగ్రెస్ అధిష్టానం గుర్రుగా ఉన్నట్లు సమాచారం. గత ఎంపీ ఎన్నికల్లో నారాయణ పేట నియోజకవర్గం లో బీజేపీ కి అత్యంత మెజారిటీ వచ్చింది. ఈ విషయం దృష్టిలో ఉంచుకుని మున్సిపాలిటీ ఎన్నికల్లో పనిచేసి ఉంటే కాంగ్రెస్ కు అనుకూలంగా ఫలితం ఉండేదని పార్టీ శ్రేణులు అంటున్నారు.ఈ ఓటమి తో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పర్ణిక కొంత నిరాశ కు గురయ్యారు.

……………………………..
ఇద్దరు మంత్రులు సక్సెస్ :
…………………………………
ఉమ్మడి జిల్లా కు చెందిన ఇద్దరు మంత్రులు మున్సిపాలిటీ ఎన్నికల్లో పూర్తి గా సక్సెస్ అయ్యారు. కొల్లాపూర్ లో మంత్రి జూపల్లి కృష్ణా రావు ఇక్కడి మున్సిపాలిటీ లో కాంగ్రెస్ ను విజయ తీరాలకు చేర్చారు. మరో మంత్రి మక్తల్ కు నియోజకవర్గానికి చెందిన వాకిటి శ్రీహరి తన పరిధి లో మూడు మున్సిపాలిటీ లలో కాంగ్రెస్ జెండా ఎగురవేశారు.మక్తల్, ఆత్మకూర్, అమరచింత మున్సిపాలిటీ లలో కాంగ్రెస్ విజయం సాధించడం లో మంత్రి పాత్ర అమోఘమైంది. అమరచింత లో 10 మున్సిపల్ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ కి 3, బీ ఆర్ ఎస్ కు 3, బీజేపీ కి 3,ఒకటి సిపిఐ కి వచ్చింది. ఏ పార్టీ కి మెజారిటీ రాకపోవడం తో అన్నీ పార్టీ లు ఇతర పార్టీ ల అభ్యర్థుల పై ఫోకస్ పెట్టారు. ఇక్కడే మంత్రి శ్రీహరి చక్రం తిప్పారు. బీ ఆర్ ఎస్ చెందిన అభ్యర్థి ని కాంగ్రెస్ పార్టీ కి మద్దతు ప్రకటించింది. దీంతో మంత్రి ఎక్స్ అఫిషియో ఓటు తో కాంగ్రెస్ కు విజయం దక్కింది. బీ ఆర్ ఎస్ నుంచి వచ్చి కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చిన అభ్యర్థి ని కి చైర్ పర్సన్ పదవి దక్కింది. మంత్రి పరిధి లోని మూడు మున్సిపాలిటీ లలో కాంగ్రెస్ కు విజయం తెచ్చిపెట్టిన వాకిటి శ్రీహరి కి కాంగ్రెస్ అధిష్టానం నుంచి ప్రశంస లు అందుకొన్నారు. దేవరకద్ర ఎమ్మెల్యే గౌనినోళ్ల మధుసూదన్ రెడ్డి తన పరిధి లోని దేవరకద్ర, భూత్పూర్, కొత్తకోట మున్సిపాలిటీ ల పై కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగురవేశారు.మూడు మున్సిపాలిటీ లను కాంగ్రెస్ కు కట్టబెట్టడం లో ఇక్కడి ఎమ్మెల్యే కృషి ఎంతో ఉంది. వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి తన పరిధిలో ని వనపర్తి, పెబ్బేరు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ కి విజయం తెచ్చిపెట్టారు. ఇక్కడ కాంగ్రెస్ లో ఉన్న అసమ్మతి ని ఎదురుక్కొని బలంగా నిలబడి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయం లో తన పాత్ర పోషించి సఫళీకృతులయ్యారు. గద్వాల నియోజకవర్గం లో బీ ఆర్ ఎస్ అని చెప్పుకుంటూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలుపించడం లో ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి విజయం పొందారు. కాంగ్రెస్ అభ్యర్థులకు అండగా ఉండి వారి గెలుపులో ముఖ్య పాత్ర పోషించారు. కొడంగల్ లో నియోజకవర్గం లో ని కొడంగల్, కోస్గి, మద్దూర్ మున్సిపాలిటీ లలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఈ నియోజకవర్గానికి సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిద్యం వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ మూడు మున్సిపాలిటీ లలో రేవంత్ రెడ్డి ప్రచారం చేయకున్నా… పార్టీ శ్రేణులు బాగా కష్ట పడ్డారు. ఇందులో సీఎం సోదరులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం విశేషంగా కృషి చేశారు. మహబూబ్ నగర్ లో మేయర్ పదవి కాంగ్రెస్ పార్టీ కి దక్కడం లో ఇక్కడి ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ముఖ్య పాత్ర పోషించారు. మేజిక్ ఫిగర్ కు రెండు స్థానాలు తక్కువగా ఉన్నా స్వతంత్రుల, ఎం ఐ ఎం ల సహకారం తో మేయర్ పీఠం దక్కించుకున్నారు. నాగర్ కర్నూల్ లో ఎమ్మెల్యే కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి తన పరిధి లోని నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ ని కాంగ్రెస్ పార్టీ కి కట్టబెట్టడం లో తీవ్రంగా కష్టపడ్డారు. అలంపూర్ లో బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యే విజయుడు తన పరిధి లోని అలంపూర్ మున్సిపాలిటీ పై గులాబీ జెండా రెప రెపలాడించారు.ఎవరికి వారుగా ఎమ్మెల్యే లు తమ పరిధిలోని మున్సిపాలిటీ లను దక్కించుకోవడం లో సక్సెస్ అయ్యారు.



