Take a fresh look at your lifestyle.

ప్రతి పౌరుని ‘హెల్త్ ప్రొఫైల్’ను రూపొందించేందుకు ప్రభుత్వ చర్యలు

  • అందుకు ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ఆధారిత మోబైల్ యాప్ వెబ్ దోహదడతాయని
  • ‘ఎండిఆర్.మై డిజి రికార్డ్’ మోబైల్ యాప్ ప్రారంభోత్సవంలో రాష్ట్ర మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు

ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలోని ప్రతి పౌరుని ‘హెల్త్ ప్రొఫైల్’ను రూపొందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, ఇందు కోసం ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (ఎఐ) ఆధారిత మోబైల్ యాప్ వెబ్ దోహదపడతాయని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు అన్నారు. హైదరాబాద్ మాడ్యూర్ హస్పిటల్ సర్వీసెస్ రూపొందించిన ‘ఎండిఆర్.మై డిజి రికార్డ్’ మోబైల్ యాప్ మంత్రి లాంఛనంగా ప్రారంభించారు. హైదరాబాద్ బుధవారం జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్యెల్సీ, టీపీసీసీ అధ్యక్షులు బి.మహేష్ కుమార్ గౌడ్, మాడ్యూర్ హస్పిటల్స్ సర్వీసెస్ సంస్థ చైర్మన్ మోటూరి కృష్ణప్రసాద్, వ్యవస్థాపక సిఈఓ డాక్టర్ సరోజ్ గుప్తా, చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ డాక్టర్ క్రిస్ హాంప్రయ్స్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు ప్రసంగిస్తూ ప్రజలు, ముఖ్యంగా వ్యాధిగ్రస్తుల ఆరోగ్యానికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని తెలుసుకోవడానికి ఎఐ ఆధారిత మోబైల్ యాప్ రూపొందించడం అభినందనీయమన్నారు. ప్రస్తుతం ఒక ఆసుపత్రిలో చికిత్స పొందిన వ్యాధిగ్రస్తుడు మెరుగైన వైద్య సదుపాయాలు, చికిత్స కోసం తన వ్యాధికి సబంధించిన వివరాలతో మరోక ఆసుపత్రికి వెళ్ళి సంబంధిత ఆసుపత్రి రోగి వ్యాధికి సంబంధించిన వివరాలను విశ్వసించడంలేదన్నారు.

ఫలితంగా మరోసారి ఆ వ్యాధిగ్రస్తునికి మళ్ళీ అన్ని వైద్య పరీక్షలు చేయడం వల్ల రోగి మానసికంగా, ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్నాడన్నారు. ఇలాంటి పరిస్థితిని నివారించడానికి, ఏ ఆసుపత్రికి వెళ్ళినా ప్రజలకు సంబంధించిన ఆరోగ్య వివరాలు విశ్వనీయంగా, అందుబాటులో ఉండే విధంగా ప్రజల సమగ్ర ఆరోగ్య సమాచారాన్ని రూపొందించాలని ప్రభుత్వం భావిస్తుందన్నారు. ఎఐ ఆధారిత మోబైల్ యాప్ ద్వారా ఒక వ్యక్తి పూర్తి రక్తపోటు, మధుమేహ, తదితర ఆరోగ్య వివరాలను వెంటనే తెలియజేయడం ద్వారా రోగికి మెరుగైన చికిత్సను అందించడంతో పాటు అతనికి ఆర్ధికంగా వెసులుబాటు కలుగుతుందన్నారు. మరోవైపు భవిష్యత్ ఒక వ్యక్తి ఎదుర్కొనే ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించడం వల్ల అప్రమత్తమవుతారని మంత్రి వివరించారు. ఎంఎల్ మహేష్ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ప్రస్తుతం మెరుగైన విద్యను అందించేందుకు రాష్ట్రంలో మంచి విద్యా సంస్థలు ఉన్నాయని, ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు వైద్య రంగంలోని ప్రముఖ సంస్థలను రాష్ట్రానికి ఆహ్వానిస్తున్నామన్నారు. అందులో భాగంగానే ఇటీవల దావోస్ జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో మొత్తం రూ.1.78 లక్షల కోట్ల పెట్టుడుల ప్రతిపాదనలు వచ్చాయని, ఇందులో పలు వైద్య రంగం సంస్థలు ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాలు చేసుకున్నాయని మహేష్ వివరించారు. మోటూరి కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ఒక వ్యక్తి ముఖం లేదా శరీర అవయవాలను కేవలం 45 సెకండ్ల పాటు పరిశీలించి ఆ వ్యక్తికి సంబంధించిన పూర్తి ఆరోగ్య సమాచారాన్ని తెలియజేసే విధంగా ‘ఎండిఆర్.మై డిజి రాకార్డ్’ యాప్ రూపొందించినట్లు వెల్లడించారు.

Leave A Reply

Your email address will not be published.