Take a fresh look at your lifestyle.

రవీంద్రఖని రైల్వే స్టేషన్లో స్వచ్ఛభారత్ 

రామకృష్ణాపూర్, ముద్ర : స్థానిక రవీంద్రఖని రైల్వే స్టేషన్లో పట్టణ బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో గురువారం స్వచ్ఛ భారత్ నిర్వహించారు. గావ్ ఛలో.. బస్తీ ఛలో కార్యక్రమంలో భాగంగా స్టేషన్ ఆవరణలో పెరిగిన పిచ్చి మొక్కలను,చెత్త చెదారాలను నాయకులు తొలగించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం అశోక్,పెద్దపల్లి పురుషోత్తం,డివి దీక్షితులు,పట్టణ అధ్యక్షుడు ఠాకూర్ ధన్ సింగ్,మాజీ కౌన్సిలర్ గడ్డం సంపత్,తోట పద్మ,జంగం జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.