Take a fresh look at your lifestyle.

నిరంతరం కొనసాగుతున్న ఎస్ఎల్బీసీ సహాయక చర్యలు

  • పునరుద్ధరించిన కన్వేయర్ బెల్టు.
  • కొనసాగుతున్న స్టీల్ వ్యర్థ పదార్థాల తొలగింపు.
  • నిరంతరాయంగా కొనసాగుతున్న మట్టి తవ్వకాలు, డి వాటరింగ్ ప్రక్రియ,

అచ్చంపేట, ముద్ర: నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం దోమల పెంటఎస్ ఎల్ బి సి, టన్నెల్ ప్రత్యేక అధికారి శివ శంకర్ లోతేటి,శుక్రవారం ఎస్ ఎల్ బి సి, టన్నెల్ లోపల జరుగుతున్న సహాయక చర్యలపై సహాయక బృందాల ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.సమీక్ష సమావేశం అనంతరం ప్రత్యేక అధికారి శివ శంకర్ లోతేటి, మాట్లాడుతూ.సహాయక బృందాలు తమకు కేటాయించిన పనిని పూర్తి స్థాయిలో చేపడుతూసహాయక చర్యలు వేగవంతం చేస్తున్నట్లు తెలిపారు.టన్నెల్ లోపల అత్యధికంగా పేరుకుపోయిన స్టీలు ను లోకో ట్రైన్ ద్వారా బయటకు తరలిస్తున్నట్లు వివరించారు. టన్నెల్ లోపల 24 గంటల పాటు 5 ఎస్కావేటర్లు స్టీలు భాగాలను, ప్రమాద ప్రదేశంలో భారీగా ఉన్న రాళ్లను లోకో ట్రైన్ ప్లాట్ ఫామ్ పైకి తరలిస్తూ ,మట్టి తవ్వకాలు చేపడుతూ 100 మీటర్ల వరకు పునరుద్ధరించిన కన్వేయర్ బెల్టు ద్వారా మట్టి , బురదను,బయటకు తరలిస్తున్నట్లు తెలియజేశారు.టన్నెల్ లోపల ఉన్న ఊట నీటిని నిరంతరం బయటకు పంపింగ్ చేస్తున్నట్లు తెలియ జేశారు.సహాయక బృందాలకు అవసరమైన వసతులను కల్పిస్తూ, ఆహారం, ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ సహాయక చర్యల పురోగతిపై ప్రతి రోజూ సమీక్ష సమావేశం నిర్వహిస్తూ, సహాయక చర్యలు వేగవంతం చేస్తున్నట్లు వివరించారు.ఈ సమీక్ష సమావేశంలో,ఆర్మీ అధికారులు వికాస్ సింగ్, విజయ్ కుమార్, సింగరేణి వైన్స్ రిస్క్యూ జనరల్ మేనేజర్ బైద్య, ఎస్ డి ఆర్ ఎఫ్ అధికారి గిరిధర్ రెడ్డి, హైడ్రా అధికారి, దక్షిణ మధ్య రైల్వే అధికారి రవీంద్రనాథ్, నీటిపారుదల శాఖ డి ఈ శ్రీనివాసులు,జి ఎస్ ఐ అధికారులు రాజ్ కుమార్, జె పి కంపెనీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.