Take a fresh look at your lifestyle.

నైతిక సిద్ధాంతం కలిగిన పార్టీని ప్రజలు ఆదరిస్తారు.

ముద్ర,మోత్కూర్:

సైద్ధాంతిక సిద్ధాంతం కలిగిన పార్టీలానే ప్రజలు ఆదరిస్తారని బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తూళ్ళ వీరేందర్ గౌడ్, సూర్యపేట జిల్లా అధ్యక్షురాలు చల్ల శ్రీలత రెడ్డి అన్నారు. ఆదివారం మోత్కూర్ మున్సిపాలిటీ కేంద్రంలో జరిగిన పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహాబియన్ ముగింపు కార్యక్రమంలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడుతూ పార్టీ నిర్మాణం బూతు స్థాయి నుండి పార్టీని బలోపేతం చేసినప్పుడే పార్టీ అధికారంలోకి రాగలరని అన్నారు. అవినీతికి వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాటం చేయటం వలనే భారత దేశంలో బిజెపి అతిపెద్ద పార్టీగా ఆవరించి అధికారంలోకి వచ్చిందని అన్నారు రాబోయే రోజుల్లో తెలంగాణలో కచ్చితంగా బిజెపి పార్టీ అధికారంలోకి రావడానికి ప్రతి కార్యకర్త సైనికులు వల్లే పనిచేయడం అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న జన గణన సర్వేలో సంక్షేమ పథకాలు ప్రతిష్టంగా అమలు అయ్యేటట్టు బి ఎల్ ఓల కు సహకరించాలని కోరారు. నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ఇంటింటికీ తీసుకెళ్లి అమలు అయ్యేటట్టు చూడాలని అన్నారు పట్టణ అధ్యక్షులు చాలా మంజుల అధ్యక్షతన నిర్వహించిన ఇట్టి కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి వంగవీటి శ్రీనివాసరావు, ప్రశిక్షణ ప్రబారి ,గౌరు శ్రీనివాస్ గుప్తా ,మోత్కూరు రూరల్ మండల అధ్యక్షులు గూడెం మధుసూదన్ రెడ్డి, అడ్డ గూడూరు మండల అధ్యక్షులు అనుబోతు సైదులు, జిల్లా నాయకులు కొణతం నాగార్జున రెడ్డి, బయ్యని చంద్రశేఖర్, కూరాకుల వెంకన్న , పోచం సోమయ్య, ఏనుగు జితేందర్ రెడ్డి, మోత్కూరు బ్రహ్మచారి , బిమిడి తిరుమల్ రెడ్డి, బండ నరసింహ ఉషారాణి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.