ముద్ర ప్రతినిధి, నిర్మల్:
నిర్మల్ జిల్లాలో పనిచేస్తున్న నామినల్ మస్టర్ రోల్ (ఎన్ఎంఆర్) కార్మికులకు శ్రమకు తగ్గ వేతనం అందించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశించారు. ఎన్ఎంఆర్ వేజెస్ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధ్యక్షతన సంబంధిత అధికారులతో నిర్వహించారు. ఇందులో భాగంగా దినసరి కార్మికుల చేతనాల పెంపు గురించి చర్చించారు. 2024 – 25 సంవత్సరానికి గాను 15 శాతం, 2025 – 26 సంవత్సరానికి 10 శాతం, 2026 – 27 సంవత్సరానికి 5 శాతం వేతనాలు పెంచారని కలెక్టర్ తెలిపారు. కార్మికుల శ్రమకు తగిన వేతనం ఇవ్వడం ద్వారా వారిని గౌరవించినవారిమౌతామని పేర్కొన్నారు. కార్మికులకు సంబంధిత వేతనాలు అందేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని స్పష్టం చేశారు.ఈ సమావేశంలో జిల్లా కార్మిక శాఖ అధికారి రాజలింగు, సిపిఓ జీవరత్నం, డిఆర్డిఓ విజయలక్ష్మి, జడ్పి సీఈవో శంకర్, ఈడి ఎస్సీ కార్పొరేషన్ శంకర్, బిసి సంక్షేమ అధికారి శ్రీనివాస్, ఆర్ అండ్ బి సుభాష్, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.