Take a fresh look at your lifestyle.

కాళేశ్వరం క్షేత్రానికి తగిన బస్టాండ్ ను నిర్మిస్తా పుష్కరాలసమీక్షలో మంత్రి శ్రీధర్ బాబు

 

మహాదేవపూర్, ముద్ర:

పుష్కరాలలో కాళేశ్వరం అభివృద్ధి కోసం ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు కోరారు. బస్ స్టాండ్ లేకపోవడం వల్ల భక్తులు ఇబ్బంది పడుతున్నారని, బస్టాండ్ స్థలం కోసం చెరువు సర్వే చేయాలని, కాళేశ్వరం పుణ్య క్షేత్రంలో అష్ట తీర్థాలతో ఘాట్లు నిర్మించడంతోపాటు తీరం వెంబడి రోడ్ల నిర్మించడం, క్షేత్రంలోని రోడ్లను సాధ్యమైనంత వెడల్పు చేయాలని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు కోరారు.ఈఓ కార్యాలయంలో సరస్వతి అంత్య పుష్కరాలు మరియు రాబోయే గోదావరి పుష్కరాల సందర్భంగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

రోడ్ల వెడల్పు విషయంలో గ్రామస్తులు సహకరిస్తే వారికి భవిష్యత్తులో పుణ్యక్షేత్రం అభివృద్ధి చెంది మేలు జరుగుతుందని అన్నారు. అధికారులు నిర్ణయించిన లక్ష్యాలను విధివిధానాలను మొక్కుబడిగా కాకుండా సృజనాత్మకత పాటించి పనులు పూర్తి చేయడంలో అంచనాలు తయారు చేయడంలో క్రియాశీలక పాత్ర వహించారని మంత్రి కోరారు, కన్నేపల్లి గెస్ట్ హౌస్ ను అందుబాటులోకి తేవాలని పుష్కరాల నిర్వహణకు సంబంధించిన పనులను అధికారులు సమన్వయంతో మే మొదటి వారం వరకు పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన మౌలిక వసతులు, రోడ్లు, పారిశుధ్యం, భద్రత వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. బస్టాండ్ కు చెరువు స్థలం కేటాయించాలని సీసీఎల్ఏ తో ఫోన్ లో మాట్లాడి
చెరువు మొత్తం ఎండి పోయింది, పంటలు కూడా సాగు చేయడం లేదు .

కాబట్టి బస్ స్టాండ్ నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని కోరారు. బస్ స్టాండ్ స్థలం గెజిట్ లో లేకున్నా ఆటంకం కలిగిస్తున్నారని అటవీ శాఖ అధికారి నవీన్ కుమార్ కుమార్ ప్రశ్నించారు.ఈ సందర్భంగా ముఖ్యమైన సమావేశానికి ఎస్‌ఈ స్థాయి అధికారులు హాజరు కాకపోవడంపై మంత్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. “మాకేం పని లేదనుకుంటున్నారా? పుష్కరాల కంటే ముఖ్యమైన పనులు ఏమి ఉన్నాయి?” అని అధికారులను ప్రశ్నించారు. శుక్రవారం మహాదేవపూర్ మండలంలోని కాళేశ్వరం ప్రాంతంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు మరియు ప్రారంభోత్సవాలు నిర్వహించారు. కాళేశ్వరం నుంచి పలుగుల వరకు 22 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించబోయే 7 కిలోమీటర్ల డబుల్ బీటీ రోడ్డు పనులకు, అదేవిధంగా కాళేశ్వరంలో 1.20 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న మ్యూజియం పనులకు, ఆది ముక్తేశ్వర దేవస్థానం నుండి సరస్వతి ఘాట్ వరకు 2 కోట్ల 38 లక్షల రూపాయల వ్యయంతో బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడంతో పాటు, 1 కోటి 55 లక్షల రూపాయలతో నిర్మించిన అన్నదాన సత్రాన్ని మంత్రి ప్రారంభించారు. కాళేశ్వరం మరియు అన్నారం గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను మంత్రి అందజేశారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ నిర్దేశించిన టైంలో గాని శాఖలు అధికారులు వారి కేటాయించిన పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ధార్మిక సంస్థ సలహాదారుడు గోవింద హరి, ఎస్పీ సంకీర్త్, అటవీ శాఖ అధికారి నవీన్ రెడ్డి, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, దేవాదాయ, ఇరిగేషన్, విద్యుత్తు, పీఆర్, ఇరిగేషన్, మిషన్ భగీరథ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.