ముద్ర ప్రతినిధి, నిర్మల్:
అవార్డులు అధికారుల కృషికి గుర్తింపు ఇస్తాయని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. నిర్మల్ జిల్లాకు ఇటీవల రెండు స్కోచ్ అవార్డులు లభించిన నేపథంలో కలెక్టర్ అభిలాష అభినవ్ మంత్రి జూపల్లి కృష్ణారావును హైదరాబాదులో ఖానాపూర్ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్ తో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా జిల్లాకు రెండు విభాగాల్లో స్కోచ్ అవార్డులు లభించడం గర్వకారణమ ని మంత్రి ప్రశంసించారు. పొనికివనం ఏర్పాటు,అమ్మ రక్షిత కార్యక్రమం అమలు విజయవంతంగా కొనసాగిస్తున్నందుకు అధికారులను మెచ్చుకున్నారు. మున్ముందు ఇదే స్ఫూర్తితో పనిచేసి జిల్లాకు మరింత పేరు తీసుకురావాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, జిల్లాలో వినూత్న కార్యక్రమాలు అమలు పరిచేందుకు ప్రోత్సాహం అందిస్తూ మార్గ నిర్దేశం చేసిన ముఖ్యమంత్రికి, మంత్రులు జూపల్లి, సీతక్క, దామోదర రాజ నరసింహలకు కృతజ్ఞతలు తెలియజేశారు. మంత్రిని కలిసిన వారిలో డిఆర్డిఓ విజయలక్ష్మి, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి రాజేందర్, తదితరులు ఉన్నారు.