Take a fresh look at your lifestyle.

తోపుగని చెరువులో ప్రత్యేక పూజలు చేసిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య

ముద్ర ప్రతినిధి, భువనగిరి :
యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణం తోపుగని చెరువు గోదావరి జలాలతో నిండి అలుగు పోస్తున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలేరు నియోజకవర్గంలో ఉన్న ప్రతి చెరువు నిండేలా చేసి ప్రజలకు, రైతులకు నీరు అందించడం తమ లక్ష్యమని తెలిపారు. యాదగిరిగుట్ట పట్టణంలోని తోపుగాని చెరువు నిండడంతో పరిసర ప్రాంతాల చెరువులు కూడా నింపేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
యాదగిరిగుట్ట నుండి వంగపల్లి, రామాజీపేట, తాళ్లగూడెం తదితరంగా 15కు పైగా గ్రామాలకు చెరువులు నింపి నీరు అందే విధంగా చర్యలు చేపట్టామని తెలిపారు. చెరువులు నిండడంతో రైతులకు సాగునీరు అందడంతో పాటు భూగర్భ జలాలు కూడా పెరుగుతాయని పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.