Take a fresh look at your lifestyle.

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాభివృద్ధి కోసం కృషి చేస్తా -మున్సిపల్ కౌన్సిలర్ జావిద్

 

ముద్ర, తాండూర్: ఆర్థికంగా చాలా వెనుకబడి ఉన్న 8వ వార్డు ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థుల, అభివృద్ధి కోసం చేయూతనందిస్తానని బి ఆర్ఎస్ పార్టీ 8వ వార్డ్ కౌన్సిలర్ తెలిపారు. వికారాబాద్ జిల్లా తాండూర్ మున్సిపల్ పరిధిలోని రాజీవ్ కాలనీ, ఇందిరమ్మ కాలనీలో తాండూర్ పట్టణానికి ఆమడ దూరంలో ఉన్నందువల్ల అభివృద్ధికి నోచుకోలేదు. కావున ప్రమాణ స్వీకారం చేసిన తదుపరి ప్రభుత్వ పాఠశాలల సందర్శించి, ఉపాధ్యాయులతో మధ్యాహ్న భోజనం, తరగతి గదులు, తదితర సమస్యల గురించి చర్చించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాఠశాలలలొ నెలకొన్న సమస్యల గురించి ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి సత్వర పరిష్కారం అయ్యేలా నా వంతు సహకారం అందిస్తానని ఆయన తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.