Take a fresh look at your lifestyle.

హైద‌రాబాద్‌కు మ‌రో 800 ఈవీ బ‌స్సులు కేటాయించండి

  • కేంద్ర భారీ ప‌రిశ్రమ‌ల శాఖ మంత్రి కుమార‌స్వామికి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి.

ముద్ర, తెలంగాణ బ్యూరో : హైద‌రాబాద్‌కు మ‌రో 800 ఎల‌క్ట్రిక్ బ‌స్సులు (ఈవీ) కేటాయించాల‌ని సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర భారీ ప‌రిశ్రమ‌ల శాఖ మంత్రి హెచ్‌.డి.కుమార‌స్వామికి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో కేంద్ర మంత్రితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ‌నివారం భేటీ అయ్యారు.ఇటీవ‌ల హైద‌రాబాద్‌కు 2000 ఈవీ బ‌స్సులు కేటాయించార‌ని, ప్రస్తుత న‌గ‌ర అవ‌స‌రాల‌ను దృష్టిలో పెట్టుకొని పీఎం-ఈ డ్రైవ్ ప‌థ‌కం కింద  అద‌నంగా 800 బ‌స్సులు కేటాయించాల‌ని కోరారు.ఆర్టీసీ డ్రైవ‌ర్లు, మెకానిక్‌లు బ‌స్సు నిర్వహ‌ణ చూసేలా హైబ్రిడ్ జీసీసీ మోడ‌ల్‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాల‌ని కేంద్ర మంత్రికి సీఎం సూచించారు.తెలంగాణ ఆర్టీసీ డీజిల్ బ‌స్సుకు రెట్రోఫిట్టెడ్ చేప‌ట్టగా అది స‌ఫ‌ల‌మైంద‌న్నారు.ఆ బ‌స్సు న‌గ‌రంలో రాక‌పోక‌లు సాగిస్తోంద‌ని కేంద్ర మంత్రి దృష్టికి సీఎం తీసుకెళ్లారు. ప్రస్తుతం ఉన్న డీజిల్ బ‌స్సుల‌కు రెట్రో ఫిట్‌మెంట్ అవ‌కాశం క‌ల్పించాల‌ని కేంద్ర మంత్రికి సీఎం విజ్ఞప్తి చేశారు.

Leave A Reply

Your email address will not be published.