ముద్ర ప్రతినిధి, నాగర్‌కర్నూల్:
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఎర్రగడ్డ బస్తీలో హిందూ సమ్మేళనం బుధవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఆర్‌ఎస్‌ఎస్ స్థాపనకు వందేళ్లు పూర్తైన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆచార్య అభినవ శంకరానంద స్వామి మాట్లాడుతూ, హిందూ సమాజం జాగృతం కావాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుత సమాజంలో ధర్మ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ హిందువుగా జీవించాల్సిన అవసరం ఉందని తెలిపారు.
ప్రతి హిందువు తమ పిల్లలు, కుటుంబ సభ్యులు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనేలా ప్రోత్సహించాలని సూచించారు. భారతదేశ గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజేసే విధంగా ధార్మిక కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.
సమ్మేళనంలో చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
ఈ కార్యక్రమంలో ప్రధాన వక్త భాస్కరయోగి, ఆర్‌ఎస్‌ఎస్ విభాగ్ సంఘ్ చాలక్ శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ తీగల సునేంద్ర,21 వార్డు కౌన్సిలర్ శంకర్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు శ్రీనివాసులు, కార్యదర్శి పిడికిళ్ల జంగయ్య, పట్టణ కార్యవహ్ వేముల సురేశ్ తదితరులు పాల్గొన్నారు.