Take a fresh look at your lifestyle.

పోలీస్ గ్రీవెన్స్ డేలో బాధితుల పిర్యాదులను పరిశీలన -జిల్లా ఎస్పి నరసింహ ఐపీఎస్

 

ముద్ర సూర్యాపేట జిల్లా ప్రతినిధి:

జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పోలీస్ గ్రీవెన్స్ డే కార్యక్రమంలో జిల్లా ఎస్పి నరసింహ ఐపీఎస్ పిర్యాదుదారుల నుండి వినతులు స్వీకరించారు. జిల్లా పరిధిలోని వివిధ మండలాల నుంచి వచ్చిన బాధితులు వివిధ సమస్యలపై ఫిర్యాదులకు సంబంధించి బాధితులు ఎస్పి ప్రత్యక్షంగా కలిసి వినతులు సమర్పించారు.
ఈ సందర్భంగా ఎస్పి ప్రతి ఒక్క బాధితుడి సమస్యను విని, వాటి పరిష్కారం కోసం తక్షణ చర్యలు తీసుకునేలా సంబంధిత పోలీస్ అధికారులుతో ఫోన్ ద్వారా మాట్లాడి అవసరమైన సూచనలు జారీ చేశారు. ప్రజలకు త్వరితగతిన న్యాయం అందేలా, వారి సమస్యలను ఆలస్యం చేయకుండా పరిష్కరించాలనే దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
అలాగే, ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం పోలీస్ శాఖ ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటుందని ఎస్పి తెలిపారు.
చట్టబద్ధమైన విధానంలో ప్రతి ఫిర్యాదును పరిశీలించి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.

Leave A Reply

Your email address will not be published.