ముద్ర ప్రతినిధి, జగిత్యాల:
గ్రామ సభల ద్వారా భూముల రీ-సర్వే పనులు వేగవంతం చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ బి.ఎస్ లత పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన భూసర్వే-రీ సర్వే సందర్భంగా బీర్పూర్ మండలంలోని నేదునూర్ గ్రామంలో భూముల రీ-సర్వేకు సంభందించిన అవగాహణ సదస్సును శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా భూమి రీ-సర్వే చేయు చట్టం పరిధిలో వున్నా Survey and Boundary Act, 1923 గురించి, సర్వే కార్యాక్రమాల గురించి, సర్వే చేయు పని విదానాల గురించి ఈ గ్రామ సభ ద్వారా నేదునూర్ గ్రామ రైతులకు, గ్రామ ప్రజలకు అవగాహణ కల్పించారు. అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు ఈ భూ సర్వే సహకరించాలని కోరారు. అలాగే సంబంధిత అధికారులు ప్రజల సహకారంతో భూ సర్వే విషయంలో కచ్చితంగా సర్వే పనులు నిర్వహించి అందరికీ ఉపయోగకరంగా ఉండేలా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల ఆర్డీవో మధు సూదన్, సర్వే & భూమి కొలతల అధికారి, బీర్పూర్ తహశీల్దార్, మండల సర్వేయర్, మండల గిర్దావర్, RIలు & స్థానిక పంచాయితీ కార్యదర్శులు, సంబంధిత GPOలు, స్థానిక సర్పంచ్ లు, స్థానిక ప్రజా ప్రతినిధులు, గ్రామ పాలన అధికారి, నూతనముగా అనుమతి పొందిన సర్వేయర్, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.