వికారాబాద్, ముద్ర విలేకరి : రైతులు పండించిన వరి ధాన్యం, తడిసిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేసి మద్దతు ధర చెల్లించాలని బి ఆర్ ఎస్ పార్టీ చేస్తున్నామని ధారూర్ మండల బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వేణుగోపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన పిలుపుమేరకు ధారూర్ మండల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో, పార్టీ నాయకులతో కలిసి మండల పరిధిలోని వరి కొనుగోలు కేంద్రాలు మోమిన్ కలాన్, నాగారం, తరిగోపుల గ్రామాలను శనివారం సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు పండించిన వరి ధాన్యాన్ని మద్దతు ధరకు వెంటనే కొనుగోలు పూర్తి చేసి మద్దతు ధరతో ఎలాంటి కోత విధించకుండా రైతుల ఖాతాలలో డబ్బులు జమ చేయాలని డిమాండ్ చేశారు. గత కొన్ని రోజులుగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయని పచ్చిరొట్ట ఎరువులను వేసుకుని నాణ్యమైన పంటల దిబ్బడిని సాధించుటకు రైతులకు సరిపడా జీలుగ, జనుము విత్తనాలు సరఫరా చేయాలని కోరారు. మోమిన్ కలాన్ గ్రామంలో ఏర్పాటు చేసిన వారి కొనుగోలు కేంద్రానికి కొనుగోలు చేసిన వరి. ధాన్యాన్ని తరలించుటకు లారీలు రాకపోవడంతో ఇంకా 60 మంది రైతులకు సంబంధించిన వరి పంట పూర్తిగా వారి ఇంటిదగ్గర రోడ్ల పైన ఉండడం జరిగిందని తెలిపారు. డిమాండ్ కు తగ్గ లారీలను వెంటనే పంపించి త్వరితగతిన కొనుగోలు చేయాలని కోరారు. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా తడిసిన ధాన్యాన్ని ఎలాంటి కోత లేకుండా తడిసిన ధాన్యాన్ని మొత్తం కొనుగోలు చేసి మద్దతు ధర ఇవ్వాలి అన్నారు.
నాగారంలో మిగిలిన ధాన్యాన్ని పదిమంది రైతుల ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని కోరారు. నాగారం గ్రామంలో సన్నవడ్లు కొన్న రైతులకు ట్రాన్స్ పోర్ట్ సౌకర్యం కలిగించకుండా నేరుగా రైతుల టాక్టర్లతో రైస్ మిల్లులకు పంపించడం జరిగిందన్నారు. కావున ఇట్టి రైతులకు ట్రాన్స్ పోర్ట్ డబ్బులను పూర్తిగా చెల్లించాలని డిమాండ్ చేశారు. నాగారం కొనుగోలు కేంద్రంలో దాదాపు 35 లారీల వరి ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందని, హమాలీలకు లారీలు లోడ్ కు సంబంధించిన డబ్బులను ఇవ్వడం లేదని చెప్పారని, కావున హమాలీలకు అట్టి డబ్బులను చెల్లించాలని కోరారు. తరిగోపుల వరి కొనుగోలు కేంద్రంలో ఇప్పటివరకు ఒక్క వరి బస్తా కూడా రైతుల నుండి కొనుగోలు చేయలేదని అన్నారు. తరిగోపుల కొనుగోలు కేంద్రం ప్రారంభించి వారం రోజులు అవుతున్నా ఒక బస్తా వరి కొనుగోలు చేయకపోవడం రైతులకు ఇబ్బంది కలిగించడం చాలా దురదృష్టకరమని అన్నారు.ఇప్పటికే దాదాపు సగం మంది రైతులు ప్రైవేట్ మార్కెట్లో అమ్ముకుని నష్టపోవడం జరిగిందని తెలిపారు. ఫఇంకా మిగిలిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు ప్రారంభించి తడిసిన ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేసి రైతులకు మద్దతు ధర చెల్లించాలని కోరారు.అదేవిధంగా మండలంలోని ప్రతి కొనుగోలు కేంద్రం వద్ద లారీలు సమయానికి రాకపోవడం వల్ల ధాన్యం తరలింపు ఇబ్బందిగా ఉందని అన్నారు. సరిపడా లారీలు వెంటనే పంపించి కొనుగోలు పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మండల టిఆర్ఎస్ పార్టీ నాయకులు రైతులు తదితరులు పాల్గొన్నారు.
Prev Post