Take a fresh look at your lifestyle.

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ప్రారంభించనున్న స్పీకర్

వికారాబాద్, ముద్ర విలేకరి : తెలంగాణ ఆవిర్భావ వేడుకలను అట్టహాసంగా నిర్వహించుటకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కార్యక్రమంలో భాగంగా జూన్ 2 న జరిగే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రారంభించనున్నారని ఆ పార్టీ వికారాబాద్ పట్టణ అధ్యక్షుడు అర్ధ సుధాకర్ రెడ్డి తెలిపారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా స్పీకర్ జాతీయ జెండాను ఎగురవేసి వేడుకలను ప్రారంభిస్తారని తెలిపారు.తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ప్రారంభించుటకు తెలంగాణ ప్రభుత్వం ముఖ్యలను నియమించింది. వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించబడే ఆవిర్భావ దినోత్సవం వేడుకలకు ముఖ్య అతిథిగా స్పీకర్ హాజరవుతారని ఆయన తెలిపారు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జూన్ 2 న సోమవారం ఉదయం 10 గంటలకు స్పీకర్ జాతీయ జెండాను ఆవిష్కరించి ఆవిర్భావ దినోత్సవం వేడుకలను ప్రారంభిస్తారని తెలిపారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను అట్టహాసంగా నిర్వహించుటకు అన్ని పార్టీల నాయకులు హాజరుకావాలని ఆయన కోరారు.

Leave A Reply

Your email address will not be published.