Take a fresh look at your lifestyle.

చైర్మన్ స్థానాన్ని దక్కించుకుంటాం. మాజీ ఎమ్మెల్యే చల్లా విశ్వాసం.

 

ముద్ర. పరకాల.

పరకాల మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు చూపిస్తున్న ఆదరణ చూస్తుంటే అత్యధిక స్థానాలు గెలుచుకొని చైర్మన్ స్థానాన్ని దక్కించుకుంటామన్న విశ్వాసాన్ని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి వ్యక్తం చేశారు. శనివారం 9వ వార్డు ఏడవ వార్డు అభ్యర్థుల బండారి కవిత కృష్ణ దుంపేటి నాగరాజుల తో కలిసి ఆయన ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. గతంలో తాను ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో పట్టణంలో చేసిన అభివృద్ధి పనులు మూలంగా ప్రజలు టిఆర్ఎస్ అభ్యర్థులకు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. ప్రజలు చూపిస్తున్న ప్రేమ అభిమానాలు చూస్తుంటే అధికార కాంగ్రెస్ పార్టీకి ముచ్చటలు పడుతున్నాయని ఆయన అన్నారు. గతంలో బండారి కవిత కృష్ణ పరకాల మున్సిపాలిటీలో కౌన్సిల్ గా పనిచేసిన అనుభవం ఉందని ఆ అనుభవంతో ఎక్కువ నిధులను 9వ వార్డు అభివృద్ధి కోసం తీసుకువచ్చి ప్రజల మెప్పు పొందే విధంగా పనిచేస్తాడని అందుకుగాను వార్డు ప్రజలు గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం గడిచిన రెండు సంవత్సరాల కాలంలో ప్రజలకు చేసిన మంచి పనులు ఏవి లేవని ఆయన విమర్శించారు. 9వ అభ్యర్థి కవిత కృష్ణ మాట్లాడుతూ ప్రచారంలో భాగంగా ప్రజలు తనకు మద్దతు పలుకుతున్నారని దాని మూలంగా గెలుస్తానన్న విశ్వాసాన్ని ఆమె వ్యక్తం చేశారు. ఇంటింటి ప్రచారంలో గత మూడు నాలుగు రోజులుగా ప్రజలు సంపూర్ణ మద్దతును తెలుపుతున్నారని వారి ప్రేమ అభిమానాలు చూస్తుంటే అత్యధిక మెజారిటీతో గెలుస్తానన్నారు ఈనెల 11న జరిగే మున్సిపాలిటీ ఎన్నికలలో ఓటు వేసి గెలిపించాలని ఇంటింటికి తిరుగుతూ ప్రచార నుండి నిర్వహించారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.